MLC Kavitha | గ్రేట్.. స్కూటీపై వచ్చి నామినేషన్‌ వేసిన కవిత..

MLC Kavitha | తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మరింత ఊపందుకుంది. ఓ వైపు ప్రచారాల హోరు, మరోవైపు నామినేషన్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులు ఖరారు అయ్యారు. నామినేషన్ల పర్వం ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 3న మొదలైన నామినేషన్ ప్రక్రియ 10వ తారీఖుతో ముగియనుంది. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఇక బీఆర్ఎస్ ప్రధాన నేతలైన సీఎం కేసీఆర్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ నామినేషన్ల దాఖలు చేస్తున్నారు.

ఇప్పటికే కేసీఆర్ రెండు చోట్ల నామినేషన్లు దాఖలు చేశారు. గజ్వేల్, కామారెడ్డిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు పత్రాలు అందజేశారు.సిరిసిల్లలో నామినేషన్ దాఖలు చేశారు మంత్రి కేటీఆర్.ఈ క్రమంలో ర్యాలీగా వెళుతుండగా.. ప్రచారం రథంపై నుండి అదుపుతప్పి వాహనంపై పడిపోయారు కేటీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్కూటీపై ప్రయాణించారు.

సామాన్యురాలిగా ఆమె స్కూటీపై వెళ్తుండటం చూసిన స్థానికులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఆమెకు అభివాదం చేసేందుకు పోటీపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజామాబాద్ జిల్లా బోధన్‌ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్‌ బోధన్‌ ఆర్‌వో కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు.నామినేషన్ దాఖలుకు ముందు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

ఈ ర్యాలీకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత హాజరు కావాల్సి ఉంది. ఆమె వెళ్తున్న దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ఆమె వాహనం ట్రాఫిక్ లో చిక్కుకుంది. దీంతో ఎమ్మెల్సీ కవిత ర్యాలీ ప్రారంభ స్థలికి చేరుకొనేందుకు స్కూటీపై ప్రయాణించారు. ఓ వ్యక్తి స్కూటీని నడుపుతుండగా కవిత వెనుకాల కూర్చొని ప్రయాణించారు. స్కూటీపై వెళ్తున్న కవితను చూసిన స్థానికులు చేతులు ఊపుతూ ఆమెకు అభివాదం చేశారు. మరికొందరు ఫోన్ లతో ఫొటోలు తీసుకున్నారు.

Leave a Reply