Kavya: డ‌బ్బులిస్తే సినిమా కోసం ఏమైనా చేస్తా.. బలగం హీరోయిన్ కామెంట్స్.

కావ్య కళ్యాణ్ రామ్.. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో కీలకపాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది.. నాలుగేళ్ల వయసులో ‘గంగోత్రి’ మూవీతో బాలనటిగా కావ్య కెరీర్ స్టార్ట్ అయింది.. ‘ఠాగూర్’, ‘విజయేంద్ర వర్మ’, ‘స్నేహమంటే ఇదేరా’, ‘బాలు’ లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.. స్టడీస్ కంప్లీట్ చేయాలనుకుని సినిమాల నుండి బ్రేక్ తీసుకున్న కావ్య రీసెంట్‌గా బలగం సినిమాలో దర్శనం ఇచ్చింది.

బ‌లగం సినిమా తర్వాత వరుస ఛాన్సులు కొట్టేస్తోంది. కావ్య ఇటీవల సినిమాల విష‌యంలో చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ర‌చ్చ లేపుతున్నాయి.సినిమా అవకాశాల విషయంలో ఏ మాత్రం తగ్గేది లేదని.. డబ్బులు ఎక్కువగా ఇస్తానంటే ఇంటిమేట్ సీన్స్, బోల్డ్ సీన్స్, బెడ్రూమ్ సీన్స్ ఇలా అన్ని సన్నివేశాల్లో నటించడానికి నేను ఓకే అంటూ బోold కామెంట్స్ చేసింది కావ్య.

ఈ బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కొంతమంది నెటిజ‌న్లు కావ్య నువ్వు ఇంత బోల్డ్‌నా ? డబ్బులు ఇస్తే బెడ్ రూమ్ సీన్స్ అయినా నీకు ఓకేనా అంటూ వ‌ల్గ‌ర్ కామెంట్స్‌తో ఆమెను టార్గెట్ చేస్తున్నారు.కొంద‌రు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు.

ఇప్పటికే చాలామంది స్టార్ హీరోయిన్లు హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటూ బికినీలు వేయడానికి, బెడ్ రూమ్ సీన్స్ చేయడానికి… రొమాంటిక్ సన్నివేశాలు, హాఫ్ న్యూడ్ గా నటించడానికి కూడా సై అంటున్నారు… ఇలాంటి సీన్ల‌లో కావ్య కళ్యాణ్ రామ్ న‌టించ‌డంలో తప్పేముంద‌ని ఆమెకు స‌పోర్ట్‌గా మాట్లాడుతున్నారు.

Leave a Reply