KCR | కర్ర సాయంతో నడుస్తున్న కేసీఆర్.. త్వరలో ప్రజల్లోకి..

allroudadda

KCR | బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కోటుకుంటు న్నారు. హిప్‌ రిప్లేస్‌మెంట్‌ తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. సర్జరీ తర్వాత ముందుగా హైదరాబాద్ నందినగర్ లోని ఆయన ఇంటికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ కు చేరుకున్నారు. ఫామ్ హౌస్ లో వైద్యుల పర్యవేక్షణలో కేసిఆర్ చికిత్స తీసుకుంటున్నారు.

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, సహాయకులు ఎప్పటికప్పుడు పర్యవే క్షిస్తున్నారు.ప్రస్తుతం కేసీఆర్‌ ఊత కర్ర సాయంతో నడుస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

allroudadda
allroudadda

ఇటీవలి వరకు కేసీఆర్ బెడ్‌కే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే వైద్య సిబ్బంది సమక్షంలో కర్ర సాయంతో నడుస్తున్నారు.సంతోష్ కుమార్ పోస్ట్ చేసిన వీడియోలో… కేసీఆర్ ఓ ఊతకర్ర సాయంతో.. వైద్య సహాయకుడి సమక్షంలో మెల్లిగా అడుగులు వేస్తున్నారు. అలా తన ఇంటి హాలు మొత్తం నడిచారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన సంతోష్ కుమార్… ఆయన ప్రతి అడుగులో దృఢ సంకల్పం కనిపిస్తోందని… కర్ర సాయంతో నడుస్తున్నాడని… త్వరలో ప్రజల ముందుకు వస్తారని పేర్కొన్నారు.

Leave a Reply