ఈ ఫోటోలోని చైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తుపట్టారా.? ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్.

ఫోటోలోని చైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడొక స్టార్ హీరోయిన్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టి.. 23 ఏళ్లు కెరీర్‌లో మలయాళం, తమిళ, తెలుగు భాషల్లో చిత్రాల్లో చేసింది. దక్షిణాదిన అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగుతో పాటు తమిళంలోనూ స్టార్ హీరోల సరసన నటించింది. అందం, అభినయంలో ‘మహానటి’గా పేరుగాంచింది.

ఈ హీరోయిన్‌కి ఫ్యాన్స్‌లో పాపులారిటీ కూడా ఎక్కువే. అటు హోమ్లీ లుక్‌లోనే కాదు.. ఇటు మాస్ లుక్‌లోనూ అవలీలగా నటించగలిగే సత్తా ఈమె సొంతం. మరి ఈ అమ్మడు ఎవరో ఈపాటికి మీకే అర్ధమై ఉంటుంది. ఆమె మరెవరో కాదు.. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.ప్రస్తుతం ఇంటర్నెట్‌లో కీర్తి సురేష్ చిన్నప్పటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.ఇక వివరాల్లోకి వెళ్తే..

మలయాళ నిర్మాత సురేష్ కుమార్-నటి మేనకల సంతానం కీర్తి సురేష్. ఫ్యామిలీది మూవీ బ్యాక్ గ్రౌండ్ కావడంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా ఏళ్ల క్రితమే పలు మలయాళ సినిమాల్లో నటించింది. 2013లో ‘గీతాంజలి’ మూవీతో లీడ్ యాక్టర్ గా మారిపోయింది. ‘నేను శైలజ’తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి..

ఆ వెంటనే పవన్ ‘అజ్ఞాతవాసి’ చేసింది కానీ అది ఫెయిలైంది. సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో లీడ్ రోల్ చేసిన ఈ బ్యూటీ.. ఏకంగా నేషనల్ అవార్డు అందుకుని ప్రతి ఒక్కరూ షాకయ్యేలా చేసింది. ఆ తర్వాత సినిమాల విషయంలో పెద్దగా కలిసి రాలేదు. రీసెంట్ టైంలో ‘సర్కారు వారి పాట’, ‘దసరా’ మాత్రమే కీర్తి కెరీర్ లో హిట్ మూవీస్.ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన ‘భోళా శంకర్’ మూవీలో, తమిళంలో మరో నాలుగు చిత్రాల్లో నటిస్తోంది.

Leave a Reply