Keerthy Suresh : కీర్తి సురేశ్ పొలిటికల్ ఎంట్రీ..!తల్లి షాకింగ్ కామెంట్స్,

తొలి సినిమా ‘నేను శైలజా’తోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిపోయింది మలయాళ బ్యూటీ కీర్తి సురేశ్‌ (Keerthy Suresh)‌‌. మొదటి సినిమాతోనే అందరి దృష్టి తనవైపు తిప్పుకుంది. ఇక ‘మహానటి’తో ఎక్కడలేని గుర్తింపు తెచ్చుకుంది. నటనలో ఏకంగా నేషనల్‌ అవార్డు గెలుచుకుని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.సావిత్రి బయోపిక్‌లో ఇంత కన్నా బాగా ఎవరు నటించలేరెమో అనేంతలా తన నటనతో కట్టిపడేసింది.

ఈ సినిమా తర్వాత లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలకు కీర్తి కేరాఫ్‌ అడ్రస్‌ అయిపోయింది. ఓ వైపు పర్‌ఫార్మెన్స్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తూనే మరోవైపు గ్లామర్ పాత్రలతోనూ అదరగొడుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది.కాగా, కీర్తి సురేశ్ గురించి సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.డానికి కారణం ఇటీవల ఆమె చేసిన కామెంట్స్ అని తెలుస్తుంది..

కీర్తి సురేష్ నటిస్తున్న రీసెంట్ మూవీ మామన్నన్.ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటిస్తుండగా ఈ సినిమాలో కీర్తి హీరోయిన్ గా నటిస్తుంది.వడివేలు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.. జూన్ 29న మామన్నన్ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ పాల్గొంటున్న విషయం తెలిసిందే.

మామన్నన్ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన్నట్లు సమాచారం..మామన్నన్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ తన పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడారు.మీరు రాజకీయాల్లోకి రాబోతున్నారా అని ఆమెకు ఒక ప్రశ్న ఎదురైంది.. ఈ విషయం పై ఆలోచించాలి అని ఆమె సమాధానం ఇచ్చారు..

కీర్తి చేసిన ఆ కామెంట్ తో భవిష్యత్ లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ఆమెకు పాలిటిక్స్ ఆసక్తి ఉందని తెలుస్తుంది.ఇంతకు ముందు కూడా కీర్తి సురేష్ బీజేపీలో జాయిన్ అవుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.. ఆ వార్తలు నిజం కాదని కీర్తి సురేష్ తల్లి మేనకా సురేష్ చెప్పుకొచ్చారు.. మరి భవిష్యత్ లో కీర్తి సురేష్ పొలిటికల్ ఎంట్రీ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.తెలుగులో కీర్తి సురేష్ దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.. దసరా సినిమా వంద కోట్ల భారీ వసూళ్లు రాబట్టింది.

Leave a Reply