పవన్ మీటింగ్ కంటే హనీ రోజ్ ని చూడడానికే ఎక్కువ జనం వస్తారు – కేతిరెడ్డి

తాజాగా కేతిరెడ్డి.. ప‌వ‌న్ ని విమ‌ర్శిస్తూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ కంటే ‘వీరసింహారెడ్డి’ హీరోయిన్ హనీ రోజ్‌కే (Honey Rose) జనాల్లో క్రేజ్ ఎక్కువ ఉందని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో ఆయనకు కౌంటర్ ఇవ్వాలని వైసీపీ నేతలు నిర్ణయించారు.

సీఎం వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ ప్రసంగ శైలిని, మూడు పెళ్లిళ్లను ఎగతాళి చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వైసీపీకి చెందిన మరో నేత, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుపతిలో కేతిరెడ్డి మాట్లాడుతూ.. నటి హనీరోజ్‌ బహిరంగ సభకు పిలిస్తే వారాహి యాత్రలో పవన్‌ కల్యాణ్‌కు వచ్చే ప్రజాబలం కంటే ఎక్కువ జనబలం ఉంటుందని అన్నారు.

ఇక వారాహి యాత్రలో కనిపించే వారు పవన్‌కి ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదని, ఆయన్ను చూసేందుకే వస్తున్నారని కేతిరెడ్డి అన్నారు. రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే స్థిరత్వం అవసరమని పవన్ కళ్యాణ్‌ని ఉద్ఘాటించి వ్యాఖ్యానించారు.

దేశంలోని ప్రజలు ఏ కొత్త రాజకీయ పార్టీనైనా స్వాగతిస్తారని, ఇతర పార్టీల కోసం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ లాగా కాకుండా సొంత పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని ఆయన అన్నారు. రాజకీయాలు, సినిమాల గురించి పవన్ కళ్యాణ్ తాజా నినాదాన్ని తెరపైకి తెస్తూ, ప్రజలు తమ అభిమాన తారకు ఓటు వేస్తే సినీ తారలందరూ అధికారంలో ఉండేవారని చెప్పారు.

Leave a Reply