స్టార్ హీరోయిన్ తో ప్రేమ‌లో ఉన్న కిరణ్ అబ్బ‌వ‌రం..! ఎవరంటే..?

Kiran Abbavaram: హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే పలు రకాల చిత్రాల ద్వారా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ఈయన ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా కిరణ్ అబ్బవరం కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది.

వినరో భాగ్యం విష్ణుకథ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈయన త్వరలో మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ క్రమంలోనే ఈయన ప్రేమలో ఉన్నాడనే వార్తలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.అది కూడా ఒక హీరోయిన్ తో.. తాజాగా కశ్మీర్ ట్రిప్ కు వెళ్ళిన కిరణ్ అబ్బవరం అక్కడ దిగిన పలు ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేశాడు.

అక్కడే సేమ్ లొకేషన్స్ తో హీరోయిన్ రహస్య గోరక్ కూడా ఫోటోలను షేర్ చేయడంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందని నెటిజన్ లు అంటున్నారు. రాజావారు రాణి గారు సినిమాతో వీరిద్దరూ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. కిరణ్, రహస్యాలకు ఆ సినిమా నుంచి మంచి బాండింగ్ ఏర్పడింది. అప్పటినుంచి వీరిద్దరూ ఫ్రెండ్షిప్ మైంటైన్ చేస్తున్నారు. అయితే ఆ ఫ్రెండ్ షిప్ ఇంకాస్త ముందుకు వెళ్లి ప్రేమగా మారిందా? అనే విషయంపై వార్తలు వినిపిస్తున్నాయి కానీ క్లారిటీ లేదు.

Leave a Reply