విరాట్ కోహ్లి తాగే లీటర్ వాటర్ ధర ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఫిట్ నెస్ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన అవసరం లేదు. కోహ్లి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూనే తన ఫిట్ నెస్ మీద బాగా శ్రద్ధ చూపెడుతుంటారు. వర్కౌట్ వీడియోలను సోషల్ మీడియాలో తన అభామానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటాడు. ఫిట్‌నెస్ విషయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులో మార్పులు తీసుకొచ్చాడు.

ఫిట్‌నెస్‌కు అత్యంత ఫ్రాధాన్యమిస్తూ యావత్ దేశానికి స్పూర్తిగా నిలిచాడు. 2014 వరకు అందరిలానే ఉన్న కోహ్లీ ఆ తర్వాత ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా మారిపోయాడు. ఆహార విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండే కోహ్లీ – తాగేనీటి విషయంలోనూ అలానే ఉంటున్నాడు.కోహ్లీ మినరల్‌ వాటర్‌‌కు బదులు ‘బ్లాక్‌ వాటర్‌’ని తాగుతాడట. బ్లాక్‌ వాటర్‌ లో సహజసిద్ధమైన అల్కలైన్‌ ఉంటుంది.

ఇవి శరీరాన్ని ఫిట్‌గా , హైడ్రేటెడ్‌ గా ఉండేలా చేస్తుంది. వ్యాధులు నుంచి దూరం ఉండొచ్చు. ఇందులో ఉండే 70 శాతం ఖనిజాలు జీర్ణప్రక్రియ, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరు స్తుంది. మనం రోజూ తాగే నీరులో pH స్థాయి 7 మాత్రమే ఉంటే బ్లాక్‌ వాటర్‌లో 7 కంటే ఎక్కువ ఉండటం గమనార్హం. అందుకే ఇందులో యాంటీ ఏజెంట్‌ గుణాలు ఉంటాయి.

చర్మం యవ్వనంగా ఉండేందుకు తోడ్పడుతుంది. గుజరాత్‌లోని వడోదర లోని ఏవీ ఆర్గానిక్స్‌ అనే అంకుర సంస్థ ‘‘ ఎవోకస్‌ ’’ పేరుతో బ్లాక్‌వాటర్‌ తయారీని ప్రారంభించింది. నీళ్లలో సహజసిద్ధమైన బ్లాక్‌ ఆల్కలీన్‌ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తుంది. అంతేకాదు ఈ బ్లాక్ వాటర్‌ చర్మ నాణ్యతను మెరుగు పరచడంతో పాటు, బరువును కూడా అదుపులో ఉంచుతుంది.

Leave a Reply