కాండ్రించి మొహం మీద ఉమ్మేశాడు.. బాలయ్య నిజస్వరూపం చెప్పిన కోట శ్రీనివాస రావు,

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ఎప్పుడూ ఏదో ఒక విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. పైగా బాలయ్య మాట్లాడే మాటలు, బ్లడ్డు, బ్రీడ్ అంటూ తమ గురించి గొప్పలు చెప్పుకునే తీరు ఎప్పుడూ కూడా విమర్శలకు దారి తీస్తూనే ఉంటుంది. మిగతా వారందిరినీ చులకన చేసినట్టుగా బాలయ్య మాట్లాడుతుంటారు. బాలయ్య గురించి, ఆయన చేసిన అవమానం గురించి సీనియర్ నటులు కోట శ్రీనివాస రావు తాజాగా చెప్పుకొచ్చారు.

నాడు జరిగిన సంగతులను కోట చెబుతూ ఎమోషనల్ అయ్యారు.సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ మధ్య ఉన్న వైరం అందరికీ తెలిసిందే. కురుక్షేత్రం, దానవీరశూరకర్ణ సినిమాలతో ఈ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అది చివరకు రాజకీయంగానూ మారింది. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న నాటి పరిస్థితుల్లో కృష్ణ మండలాధీశుడు అనే సినిమాను నిర్మించారు. ఇందులో కోట శ్రీనివాసరావు ఎన్టీఆర్‌లా అద్భుతంగా నటించేశారు.

అయితే ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు భగ్గుమన్నారు. ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. మండలాధీశుడు సినిమా ప్రభావం చాలా గట్టిగానే కోట మీద పడింది. ఎన్టీఆర్ అభిమానులు కోట మీద ఆగ్రహంతో ఊగిపోయారు. అలా ఓ సారి విజయవాడ స్టేషన్‌లో కోట కనిపిస్తే.. అభిమానులు చితకబాదేశారు. దారుణంగా అవమానించేశారు. ఈ విషయాలన్నీ కూడా కోట చెప్పుకొచ్చారు.

ఓ సారి ఎన్టీఆర్‌ను విమానాశ్రయంలో కోట కలిశారట. ఎన్టీఆర్‌ను పలకరిస్తే మాట్లాడారట. బ్రదర్ మీ గురించి విన్నాం.. మీ నటన బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.. మన లాంటి నటులకు ఆరోగ్యమే మహా భాగ్యం అని ఆశీర్వాదించారట. అలా ఎన్టీఆర్ కాళ్లకు దండంపెట్టి అక్కడి నుంచి కోట వచ్చేశారట.ఎన్టీఆర్ ఆ విషయాలన్నీ పట్టించుకోకపోయినా ఆయన పక్కన ఉన్న వారు మాత్రం వాటిని గుర్తు పెట్టుకున్నారట.

రాఘవేంద్రరావు కూడా ఓ ఏడాది పాటు వేషాలు ఇవ్వలేదని కోట తెలిపారు. ఓసారి షూటింగ్‌లో బాలయ్య ఎదురుపడితే.. నమస్కారం బాబు అని కోట మర్యాదపూర్వకంగా పలకరించారట. కానీ బాలయ్య మాత్రం కోటను దారుణంగా అవమానించారట. మొహం మీద కాండ్రించి ఉమ్మేశాడంటూ తనకు జరిగిన అవమానం గురించి కోట చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి గారి అబ్బాయి.. తండ్రిని అంటే కోపం వస్తుంది కదా? అని కోట బాలయ్య చర్యను సమర్థించారు.

Leave a Reply