YSRCP ఎంపీగా కృష్ణంరాజు భార్య..! ఎక్కడి నుండి పోటీ అంటే..

చిత్రపరిశ్రమకు, రాజకీయ రంగానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకు ఉదాహరణగా ఎన్నో చిత్రవిచిత్రమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. సినిమాల్లో రాణించిన ప్రతి వ్యక్తి కూడా రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇలా వచ్చిన సినీ ప్రముఖల్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా, ఇతర నటీనటులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచి చట్ట సభల్లో అడుగు పెట్టారు.

ప్రస్తుతం కూడా పలువురు సినీ ప్రముఖులు రాజకీయ్లాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.రాబోయే ఎన్నికల్లో రెబల్ స్టార్ కృష్ణంరాజు స‌తీమ‌ణి నరసాపురం ఎంపీగా పోటీచేయబోతున్నారా? వైసీపీ తరపున పోటీ చేయటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఎందుకంటే వైసీపీ రాజంపేట ఎంపీ, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన మిథున్ రెడ్డి రెబల్ స్టార్ భార్య శ్యామల దేవితో భేటీ అయ్యారని పార్టీ వర్గాలు చెప్పాయి.వైసీపీ హైకమాండ్ కూడా ఆమెను పార్టీలో చేర్చుకొని ఎంపీ టికెట్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. అయితే.. చనిపోయిటప్పటికి కృష్ణంరాజు బీజేపీ పార్టీలో ఉన్నారు. కానీ.. ఆయన బతికి ఉన్నరోజుల్లో అంతగా బీజేపీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు.

దానికి కారణం ఆయన అనారోగ్యం. కానీ.. ఇప్పుడు ఆయన లేరు. వైసీపీ పార్టీ ఆమెకు టికెట్ ఇచ్చేందుకు రెడీగా ఉండటంతో శ్యామలాదేవి కూడా వైసీపీలో చేరేందుకు సుముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది. మరి.. ఒకవేళ ఆమె వైసీపీ తరుపున నరసాపురం ఎంపీగా పోటీ చేస్తే.. ప్రభాస్ ఆమె తరుపున ప్రచారం చేస్తారా? ఆయన ప్రచారం చేస్తే ఇక ఆమె గెలవకుండా ఉంటుందా? చూద్దాం ఏం జరుగుతుందో?

Leave a Reply