Kriti Sanon: ప్రభాస్ తో ఉన్న బంధంపౌ కృతిసనన్ కామెంట్స్..!

కృతిస‌న‌న్ Kriti Sanonఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ ఫీమేల్ స్టార్‌. చేతినిండా సినిమాల‌తో, సోష‌ల్ మీడియా నిండా ఫొటోల‌తో నిత్యం వార్త‌ల్లో ఉంటూనే ఉన్నారు. దానికి తోడు ఈ బ్యూటీ అప్పుడ‌ప్పుడూ సోష‌ల్ మీడియాలో ఆస్క్ మీ ఎనీథింగ్ సెష‌న్ కండ‌క్ట్ చేస్తూనే ఉంటారు. ఈ సెష‌న్‌ని డీప్‌గా గ‌మ‌నిస్తే చాలా బ్యాక్ స్టేజ్ విష‌యాలు తెలుస్తుంటాయి. త‌న కో స్టార్స్ కార్తిక్ ఆర్య‌న్‌, వ‌రుణ్ ధావ‌న్ గురించి చాలా విష‌యాల‌ను పంచుకుంటూ ఉంటారు కృతిస‌న‌న్‌.

కేవ‌లం వృత్తిప‌ర‌మైన విష‌యాల‌నే కాదు, వ్య‌క్తిగ‌త‌మైన విష‌యాల‌ను కూడా ఈగ‌ర్‌గా షేర్ చేస్తూ ఉంటారు. అలాంటి ఓ సంద‌ర్భ‌మే ఇటీవ‌ల ఎదురైంది.ఇంత‌కీ మీ బాయ్‌ఫ్రెండ్ పేరేంటండీ అని అడ‌గ‌నే అడిగేశాడు ఓ నెటిజ‌న్‌. ఇంకో నాయికైతే కంగారుప‌డేదేమోగానీ, కృతిస‌న‌న్ ఇలాంటి వాటిలో ఆరితేరిపోయారు. అది చాలా సీక్రెట్‌. మీకే కాదు, నాక్కూడా అంటూ చాలా సింపుల్‌గా, స‌ర‌దాగా ఆన్స‌ర్ ఇచ్చేశారు.

ఆ మాట విని చాలా మంది వామ్మో మామూలు ముదురు కాదు అంటూ మీమ్స్ కూడా క్రియేట్ చేసేస్తున్నారు.కృతిస‌న‌న్‌Kriti Sanonకి ఆ మ‌ధ్య ప్ర‌భాస్‌తో Prabhas ల‌వ్ ఉందంటూ వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. అయితే తాము పార్టిసిపేట్ చేసిన షోలో ఈ విష‌యం గురించి స‌ర‌దాగా అన్న మాట‌లు తీవ్రంగా వైర‌ల్ అయ్యాయ‌ని, అస‌లు అలాంటిదేమీ లేద‌ని, బ‌బుల్‌ని బ్లాస్ట్ చేసేస్తున్నాన‌ని అన్నారు కృతిస‌న‌న్‌. ఈ విష‌యం గురించి, ఆ త‌ర్వాత కూడా ఆమెను చాలా మంది ఆరా తీస్తూనే ఉన్నారు.

ఆమె ప‌ట్టించుకోనట్టు వ్య‌వ‌హ‌రిస్తూనే ఉన్నారు. కృతి న‌టించిన షెహ్‌జాదా ఇటీవ‌ల విడుద‌లైంది. ఆ సినిమా అక్క‌డ పెద్ద‌గా ఆడ‌లేదు. అందుకే ఇప్పుడు ఆమె ఆశ‌ల‌న్నీ ఆదిపురుష్ మీదే పెట్టుకున్నారు. ఈ సినిమాతో పాటు నార్త్ లో మ‌రికొన్ని ప్రాజెక్టుల్లో న‌టిస్తున్నారు కృతి. మ‌రోవైపు ఎంట్ర‌ప్రెన్యుయ‌ర్‌గా కూడా రాణించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.ఫ్యాష‌న్ వ‌ర‌ల్డ్ లో ఎప్ప‌టిక‌ప్పుడు ఏం జ‌రుగుతుందో తెలుసుకుంటూ ట్రెండీగా ఉండ‌టంలో ఆమెను మించిన వారు లేర‌న్న‌ది టాక్.

Leave a Reply