Kumari Aunty | కుమారి ఆంటీ షాపు వద్ద అసలు రేట్లు ఎంతో తెలుసా..

allroudadda

Kumari Aunty | హైదరాబాద్‌ అనగానే ప్రధానంగా గుర్తుకువచ్చేది ‘ధమ్‌ బిర్యానీ’. ఘుమ ఘుమలాడే బిర్యానీతో పాటు ఎన్నో రకాల స్ట్రీట్‌ ఫుడ్స్‌కు భాగ్యనగరం ఫేమస్ అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి ‘హైదరాబాద్‌ ఫేమస్ ఆంటీ’ అనే పేరుతో ఓ మహిళ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఎన్నో రకాల నాన్‌వెజ్‌ వంటకాలను తక్కువ ధరకే అందిస్తూ ఫుడ్‌ లవర్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె సంపాదన ఎంత? ఏ వంటకం ధర ఎలా ఉంది? అన్నది ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఆమె అసలు పేరు.. దాసరి సాయికుమారి. ఏపీలోని గుడివాడ వీళ్ల సొంతూరు. 2011లో స్ట్రీట్‌ఫుడ్‌ సెంటర్‌ స్టార్ట్ చేశారు.హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌ హోటల్‌ ఎదురుగా.. స్ట్రీట్‌ఫుడ్‌ బిజినెస్‌ పెట్టుకున్నారు. తక్కువ ధరకే రుచికరమైన వెజ్‌, నాన్‌వెజ్‌ వంటకాలను అందిస్తూ ఆమె ఎంతో ఫేమస్‌ అయ్యారు. ముందు 5 కేజీలతో ప్రారంభమైన కుమారి ఫుడ్‌ బిజినెస్‌.. ప్రస్తుతం రోజుకు క్వింటాలుకు పైగా అమ్ముడుపోయే స్థాయికి చేరింది.

allroudadda
allroudadda

కొందరు యూట్యూబ్‌ ఫుడ్‌ వ్లాగర్స్‌ వరుసగా ఆమెపై వీడియోలు చేయడంతో ఒక్కసారిగా కుమారి ఆంటీ ట్రెండింగ్‌లోకి వచ్చారు. వెజ్‌, నాన్‌వెజ్‌.. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్.. కుమారి విక్రయిస్తుంటారు. హోటల్స్, రెస్టారెంట్లతో పోలిస్తే తన దగ్గర తక్కువ ధరకే ఫుడ్ దొరుకుతుందని అంటోంది కుమారి. నాన్‌వెజ్‌లో కర్రీతో కాకుండా ఫ్రై ఐటెమ్‌ తీసుకుంటే ప్లేటుకు 150 రూపాయలు చెల్లించాలి. వెజ్‌ మాత్రమే తింటే ప్లేటు 80 అవుతుంది. అదీ అన్‌లిమిటెడ్ అన్నమాట. రోజుకు 6వందల నుంచి 7వందల మంది తమ దగ్గర ఫుడ్ తింటారని చెప్తోంది కుమారి ఆంటీ.

ల్యాప్టాప్ లో అయోధ్య రామయ్యకు మంచు లక్ష్మి వెరైటీ పూజ..

ఇలా రోజుకు 30 వేల వరకూ వ్యాపారం జరుగుతోంది. అన్ని ఖర్చులు పోనూ నెలకు 2 లక్షల 50వేల నుంచి 3 లక్షల వరకు ఆమెకు లాభం ఉంటుందట.తన వద్ద వైట్‌ రైస్‌, బగారా రైస్‌, గోంగూర రైస్‌, గోబీ రైస్‌, టమాటా రైస్‌, లెమన్‌ రైస్‌, జీరా రైస్‌, పెరుగన్నం వంటి రైస్‌ ఐటెమ్స్‌ ఉన్నాయని కుమారి తెలిపారు. నాన్‌వెజ్‌కు వచ్చే సరికి చికెన్‌ కర్రీ, చికెన్‌ ఫ్రై, లివర్‌ కర్రీ, బోటీ కర్రీ, మటన్‌ కర్రీ, మటన్‌ లివర్‌, మటన్‌ హెడ్‌, ఫిష్‌ కర్రీ, ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్‌ కర్రీని సేల్‌ చేస్తున్నట్లు చెప్పారు. వెజ్‌లో ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, రెండు చట్నీలతో పాటు పప్పు, సాంబారు, మజ్జిగను ఫుడ్‌ లవర్స్‌కు అందిస్తున్నట్లు చెప్పారు.

Leave a Reply