షాక్ అప్పట్లో కాబోయే భర్తను అరెస్ట్‌ చేసిన లేడీ సింగం కన్నుమూత..!

ఎన్నో క్లిష్టమైన కేసులను ధైర్యంగా డీల్ చేశారు సబ్ ఇన్ స్పెక్టర్ రభా. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడ్డ తనకు కాబోయే భర్తను సైతం అరెస్ట్ చేసి ప్రశంసలు అందుకున్నారు. అదే సమయంలో పలు వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. పలు అభియోగాలతో సస్పెండ్ అయ్యారు.డేరింగ్ పోలీసాఫీసర్ గా డిపార్ట్ మెంట్ లో పేరు తెచ్చుకున్న రభా..రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

ఆమె ప్రయాణిస్తున్న కారును కంటైనర్ ఢీ కొనడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘట్టన జరగగా సమాచారం అందుకున్న పోలీస్ పెట్రోలింగ్ టీమ్ సంఘటనా స్థలికి చేరి రభాను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించిందని ధృవీకరించారు.
గత ఏడాది జనవరిలో భుయాన్ నియోజకవర్గంలో కొందరు బోట్ మెన్ లను రభా అరెస్ట్ చేశారు.

చట్టవిరుద్ధంగా అమర్చిన యంత్రాలతో బోట్లను నడుపుతున్నందున వీరిని అరెస్ట్ చేయగా..ఈ కేసు విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఫోన్ చేశారు. సదరు ఎమ్మెల్యేకు రభా ఘాటుగా ఆన్సర్ ఇచ్చారు. ఈ ఆడియో టేప్ లీక్ కావడంతో అప్పట్లో పెద్ద దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ…ఎమ్మెల్యేకు తగిన గౌరవం ఇవ్వాలంటూ రభాకు హితవు పలికారు.

Leave a Reply