Lakshmi Devi | కోటీశ్వరులు అయ్యే ముందు లక్ష్మీదేవి పంపించే 10 అదృష్ట సంకేతాలు ఇవే..

allroudadda.

Lakshmi Devi | మనలో ప్రతి ఒక్కరూ ధన లక్ష్మీ ఆశీస్సులు కావాలని.. ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ మహా లక్ష్మీ అడుగు పెట్టిన చోటల్లా శుభ ఫలితాలు, శుభ సంకేతాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. లక్ష్మీ దేవి ఇంట్లో నివాసం ఉంటే ధనం కొరత అనేదే ఉండదు. ఎందుకంటే ఆ తల్లి ఐశ్వర్యానికి దేవతగా పరిగణిస్తారు. ఇదిలా ఉండగా వాస్తు శాస్త్రం ప్రకారం, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని శుభ సంకేతాలను తీసుకొస్తుంది.

ఉదయాన్నే వీటిని చూస్తే..

ఉదయం నిద్ర లేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే, అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందనేందుకు సంకేతం. అలాగే మీరు ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు చెరకును చూస్తే, అది కూడా సంపదకు సంకేతంగా భావిస్తారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు, దారిలో కుక్క నోట్లో శాఖాహారం లేదా రోటీని తీసుకురావడం కనిపిస్తే, మీరు డబ్బు సంపాదించబోతున్నారని అర్థం.

allroudadda.
allroudadda.

సంకేతాలు..

మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒకేచోట మూడు బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుందని అర్థం. ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. అలాగే దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపిస్తే, అది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. అయితే ప్రతిరోజూ తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు ఒక్కసారిగా కనిపిస్తే అది అశుభ సంకేతంగా పరిగణిస్తారు.

Rayapati Aruna | నా పై దా డి చేసింది వాళ్లే.. రాయ‌పాటి అరుణ‌.

కలలో ఇవి కనిపిస్తే..

మీ కుడి చేతిలో నిరంతరం దురద పుడుతుంటే, మీకు ఆర్థిక పరమైన విషయాల్లో లాభాలొస్తాయని అర్థం. మీరు నిద్ర పోతున్నపుడు రాత్రి కలలో చీపురు, గుడ్లగూబ, కాడ, ఏనుగు, ముంగిస, శంఖం, బల్లి, నక్షత్రం, పాము, గులాబీ వంటివి కనిపిస్తే, మీ సంపద పెరిగేందుకు సంకేతంగా భావిస్తారు.

Leave a Reply