వరుణ్ తేజ్ లావణ్యా త్రిపాఠి పెళ్లి ఫిక్స్..! కట్నం ఎంతో తెలుసా..

ఆరడుగుల అందగాడు, మెగా ఫ్యామిలీ కథానాయకుడు వరుణ్ తేజ్. ‘అందాల రాక్షసి’తో తెలుగు చిత్రసీమకు పరిచయమైన సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి. వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ దాన్ని ఖండించలేదు. అలాగని… అవును, నిజమేనని అంగీకరించలేదు.’అంతరిక్షం’, ‘మిస్టర్’ సినిమాల్లో వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించారు.

ఆ సమయంలో ప్రేమలో పడ్డారని ఫిల్మ్ నగర్ గుసగుస. ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని అప్పుడప్పుడూ వార్తలు వినిపిస్తూ ఉంటాయి. త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నారని, ఏడు అడుగులు వేయడానికి రెడీ అవుతున్నారనేది కొత్త ఖబర్.అది పక్కన పెడితే… తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు అది నిజమేనని తెలుస్తోంది. వరుణ్ తేజ్, లావణ్య వివాహానికి ఇరు కుటుంబాలు ఆమోదం తెలిపినట్టు సమాచారం.

కాకపోతే పెళ్లి ముహూర్తాన్ని వారు ఇంకా నిశ్చయం చేసుకోలేదన్నది వార్తల సారాంశం. నాగబాబు కుటుంబంలో జరిగే కార్యక్రమాలకు లావణ్య వస్తుంటుంది. నిహారిక వివాహం సందర్భంగా ఆమె సందడి చేయడం అభిమానులకు తెలుసు. అప్పుడే వారి మధ్య ఏదో ఉందన్న గుసగుసలు వినిపించాయి.

వీరిద్దరూ ఓ ఇంటి వారు అవుతారంటూ అప్పటి నుంచే ప్రచారం మొదలైంది. దీన్ని వారు ఖండించలేదు కూడా. సాధారణంగా నాగబాబు మౌనంగా ఉండే రకం కాదు. అయినా, తన కుమారుడు వరుణ్ తేజ్ పెళ్లి విషయంలో వస్తున్న వార్తలకు ఆయన ఎప్పుడూ పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయలేదు. దీంతో మరోసారి వీరి పెళ్లిపై చర్చ మొదలైంది. త్వరలో నిశ్చితార్థం, కొంత విరామం తర్వాత పెళ్లి ఉంటుందని అంటున్నారు.

Leave a Reply