ఆభిమానులకి షాక్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి..!నాకు అవ్యాధి ఉంది,

లావణ్య త్రిపాఠి.. డెహ్రాడూన్ నుండి వచ్చి..,టాలీవుడ్ లో మెరిసిపోతున్న అరుదైన అందం. చేసిన తక్కువ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఎలాగో స్టార్ ట్యాగ్ వచ్చేయడంతో.. కెరీర్ పరంగా ఆచితూచి సెలక్టీవ్ గా ముందుకి పోతోంది లావణ్య. అయితే ఈ మధ్యనే లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ నిశ్చితార్థం హైదరాబాద్ లో జూన్ 09న జరిగిన విషయం తెలిసిందే.

గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఎట్టకేలకు ఒక్కటి కాబోతున్నారు. మూడు ముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టుబోతున్నారు. మిస్టర్ మూవీ సమయంలోనే వరుణ్, లావణ్య ఒకరికొకరు ఇష్టపడ్డారు. దాదాపు ఏడేళ్ల కాలం ప్రేమించుకున్నా కానీ ఎవ్వరి కంట పడకుండా రహస్యంగా మెయింటైన్ చేశారు. తాజాగా వీరు పెళ్లికి సిద్ధమయ్యారు.ఈ నేపద్యంలో లావణ్య గురించి ఒక వార్తా తెగ వైరల్ అవుతుంది..

ఇప్పుడున్న బిజీ కాలంలలోకంలో బాడీని ఫిట్ గా ఉంచుకోవడమే కాదు, మెంటల్ గా కూడా స్ట్రాంగ్ ఉండాలి. అయితే.., చాలా మంది స్టార్స్ ఫిజిక్ పై పెట్టిన శ్రద్ద, మానసిక ప్రశాంతత సాదించడంలో చూపించడం లేదు. గతంలో ఈ కారణంగానే.. వింత వింత ఫోబియాలకి గురయ్యి.. దీపికా పదుకునే అంతటి స్టార్ హీరోయిన్ నరకం అనుభవించింది.

కాగా., ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా ఈ లిస్ట్ లోకి వచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇక తనకున్న ఫోబియాని లావణ్య త్రిపాఠీనే స్వయంగా బయట పెట్టుకోవడం విశేషం. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో లైవ్‌ సెషన్‌లో పాల్గొన్న లావణ్య త్రిపాఠి అభిమానులతో ముచ్చటిస్తూ..ఈ విషయాన్ని బయట పెట్టింది

“నాకు మాములుగా దైర్యం ఎక్కువ. కానీ.., ఈ మధ్య కాలంలో కొన్ని ఆకారాలను, వస్తువులను చూస్తే తెలియకుండానే నాలో భయం పుడుతోంది. దీనిని ట్రిపోఫోబియా అంటారట. ఈ సమస్య నుండి బయట పడటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. మరి.., ఈ వింత సమస్య నుండి లావణ్య త్వరగా కోలుకోవాలని మనము కోరుకుందాము.

Leave a Reply