Lavanya Tripathi : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ తరువాత లావ‌ణ్య ఏం చేసిందో తెలిస్తే.. అభినందిస్తారు..!

టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి Lavanya Tripathi మెగా కోడలు అవుతుందని ఎవ్వరూ కూడా అస్సలు ఊహించలేదు. వరుణ్ తేజ్, లావణ్య కలిసి శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన మిస్టర్ సినిమాలో నటించారు. ఆ టైమ్ లోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇన్ని రోజులు బయటికీ చెప్పకుండానే చాలా సైలెంట్ మెయింటైన్ చేశారు వీరు. జూన్ 09న మణికొండలోని గల నాగబాబు నివాసంలో వీరి ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది.

ఈ ఫంక్షన్ కి కేవలం మెగా కుటుంబ సభ్యులు, లావణ్య కుటుంబ సభ్యులతో పాటు కొద్ది మంది మాత్రమే సినీ ప్రముఖులు హాజరయ్యారు. మిస్టర్ మూవీలో లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ వరుణ్ తేజ్ కి జోడిగా నటించింది. ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితేనేం వరుణ్ కి మాత్రం ఆ సినిమాతో మంచి తోడు దొరికింది. వరుణ తేజ్ నే పెళ్లి చేసుకుందామని అడిగాడట.

అప్పటికే వరుణ్ అంటే చాలా ఇష్టం ఉన్న లావణ్య అందుకు ఒప్పుకుందట. అలా వారి మధ్య ప్రేమ మొదలైందట. ఈ విషయాన్ని బయటికీ రాకుండా ఇద్దరూ చాలా జాగ్రత్త పడ్డారట. ఇక తరువాత వీరిద్దరూ కలిసి అంతరిక్షం మూవీలో కలిసి నటించారు. వరుణ్, లావణ్యల ఎఫైర్ నిహారిక పెళ్లిలో బయటపడింది. నిహారిక పెళ్లికి మెగా ఫ్యామిలీతో పాటు రీతువర్మ, లావణ్య త్రిపాఠి Lavanya Tripathi కూడా హాజరయ్యారు.

ఇక అప్పటి నుంచి ఆమె పై మీడియా మరింత దృష్టి సారించడం మొదలుపెట్టింది.ఐతే తాజాగా ఎల్బీనగర్‌లోని ఆనంద విద్యార్థి గృహాంలో ఇటీవ‌ల సందడి చేసింది.పిల్లలకు అత్యవసరమైన మందులను అందజేశారు లావ‌ణ్య Lavanya Tripathi . అంతేకాదు! విద్యార్థులతో మాట్లాడి వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. పిల్లలతో గడిపిన సమయం చాలా ఆనందంగా ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.ఈ వీడియొ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

Leave a Reply