Money | ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరాలంటే లక్ష్మీదేవికి ఇలా చెయ్యండి,

allroudadda

Money | జీవితంలో డబ్బు ఒక్కటే ముఖ్యం కాదని చాలా మంది అంటుంటారు. అయితే అన్నింటికంటే ముఖ్యమైన వాటిలో డబ్బు ఒకటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మనుషుల జీవితంలో చాలా వరకు వారికి వచ్చే ఇబ్బందులు, ఆందోళనలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. డబ్బు మన దగ్గర లేకపోయినట్లయితే కొన్ని సార్లు సొంత వాళ్లు కూడా మనకు దూరంగా ఉంటారు. అలాంటి పరిస్థితి మీకు రాకుండా ఉండటానికి ఆర్థిక సమస్యలు రాకుండా చూసుకోవాలి. అంటే లక్ష్మీ దేవి ఎప్పుడూ మీ ఇంటే ఉండాలి. కాబట్టి శ్రీ మహాలక్ష్మీని ప్రసన్నం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఇందుకోసం కొన్నింటిని తప్పకుండా పాటించాలి. లక్ష్మీ దేవి అనుగ్రహం పొందితే ఆర్థిక సంబంధిత సమస్యలన్నీ తొలుగుతాయని నమ్ముతారు.


చాలా మంది తమ ఇళ్లల్లో ఆహారాన్ని వృధా చేస్తుంటారు. అంతేకాకుండా బయట ప్రదేశాల్లోనూ ఆహారాన్ని వృధా చేస్తారు. ఈ విధంగా చేసినట్లయితే లక్ష్మీ దేవి అనుగ్రహం మీకు కలగదు. కోపంతో అన్నాన్ని విసిరి కొట్టడం, పారేయడం లాంటివి అస్సలు చేయకూడదు. ఈ విధంగా చేస్తే ఇంట్లో సంపద అస్సలు ఉండదు. అంతేకాకుండా సంతోషం కూడా కరవవుతుంది. ఆహారాన్ని వృధా చేయకుండా ఆకలితో ఉన్నవారి ఆకలి తీరిస్తే లక్ష్మీ దేవి ప్రసన్నమవుతుంది.

శుక్రవారం ఇవి పాటించాలి..

లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలంటే ప్రతి శుక్రవారం వేకువ జామునే నిద్ర లేవాలి. అనంతరం ఆమెను తలచుకుంటూ తలంటి స్తానం చేసి పరిశుభ్రంగా ఉన్న తెలుపు లేదా గులాబీ రంగు దుస్తులు ధరించాలి. తర్వాత శ్రీయంత్రం, మహాలక్ష్మీ ప్రతిమలకు నమస్కరించాలి. వీలైతే అమ్మవారికి తామర పువ్వును అర్పిస్తే మంచిది. ఇవి కాకుండా మీరు ఎప్పుడూ ఇంటి నుంచి బయటకు వెళ్లుతున్నా ముందుగా చక్కెర కలిపిన పెరుగును తినాలి.

Geetha Arts | గీతా ఆర్ట్స్‌లో గీతా అంటే అల్లు అరవింద్ ప్రియురాల.?

అలాగే మీరు చేపట్టిన పని లేదా ప్రారంభించిన వ్యవహారంలో ఆటంకాలు ఎదురైతే శుక్రవారం రోజు నల్ల చీమలకు చక్కెరను తినిపిస్తే మంచిది.మీరు సమస్యలతో ఇరకాటంలో ఉన్నా లేదా చిక్కల్లో ఉంటే శుక్రవారం రోజు మహాలక్ష్మీకి శంఖువు, చక్రం, తామర పువ్వును దేవికి అర్పించాలి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వచ్ఛమైన నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించేటప్పుడు దయచేసి మీ మనస్సులో ఎల్లప్పుడూ లక్ష్మీ దేవిని ప్రార్థిస్తే మంచిది. భవిష్యత్తును కట్టడి చేయాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవాలి. దీపం చాల్లరిన అనంతరం వెంటనే దాన్ని ప్రవహించే నీటిలో కలపాలి.

Recent Posts

Leave a Reply