Lipstick: మీరు లిప్ స్టిక్ వాడుతున్నారా..? అయితే ఇది గుర్తుంచుకోండి..!

ఇటీవల కాలంలో చాలామంది అందంపై ఎక్కువ మక్కువ చూపుతున్న విషయం తెలిసిందే. ఈ అందం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.యితే చాలామంది లిప్ స్టిక్ వాడేటప్పుడు చిన్నచిన్న పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. ఆ పద్దతులు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

లిప్ స్టిక్ ఎంచుకునేటప్పుడు చర్మ తత్వానికి తగ్గట్టు అందం రెట్టింపవుతుంది. కానీ ఎవరికి ఎలాంటి లిప్ స్టిక్ నప్పుతుందో తెలుసుకోవాలి .అందుకోసం ఏం చేయాలంటే చర్మం రంగు తగ్గట్టుగా లిప్ స్టిక్ ఎంచుకోవడం ఉత్తమం .అయితే చర్మం తెలుపు రంగులో ఉన్న వారికి ఆరెంజ్ కలర్ లిప్ స్టిక్ బాగా సూట్ అవుతుంది. అలాగే బ్రౌన్ కలర్ లిప్ స్టిక్ కూడా బాగుంటుంది . చర్మం చామనఛాయా రంగులో ఉంటే లైట్ బ్రౌన్ కలర్ లిప్ స్టిక్ బాగా నప్పుతుంది. అలాగే లైట్ జెర్రీ రంగు కూడా సూట్ అవుతుంది.

ఇక తెల్లటి మేనిఛాయ ఉన్నవారు ఎలాంటి లిప్ స్టిక్ షేడ్స్ వేసుకున్నా బాగుంటారు .అయితే పింక్ కలర్ లిప్ స్టిక్ వేసుకుంటే అందం రెట్టింపవుతుంది. లైట్ కలర్ లో ఉండే లిప్ స్టిక్ వేసుకున్న బాగుంటారు.

ముఖ్యంగా డార్క్ పింక్ కలర్స్ వీళ్ళకి బాగా సెట్ అవుతాయి . అయితే లేత గులాబీ రంగు షేడ్స్ ఉన్న లిప్ స్టిక్ వీళ్ళకి బాగా సెట్ అవుతుంది. కాబట్టి రాత్రిపూట దట్టంగా వేసుకోవాలి .పెదవులు పొడిబారకుండా ఉండేందుకు ముందుగా కొబ్బరి నూనె రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

అయితే లిప్ స్టిక్ ఒకసారి కొన్న తర్వాత ఆరు నెలలు దాటాక దానిని వాడకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒకసారి లిఫ్టిక్ వేసుకున్న పెదాలతో దాన్ని సరి చేయకూడదు. ముందుగా లిప్ పెన్సిల్ తో పెదవులపై అవుట్ లైన్ వేసుకుని, ఆ తర్వాత లిప్స్టిక్ రాసుకోవాలి. ఫలితంగా పెదాలు ఆకర్షణీయంగా మృదువుగా కనిపిస్తాయి.

Leave a Reply