మెగాస్టార్ చిరంజీవి ‘డాడీ’ సినిమాలో పాప ఎప్పుడు ఎంత హాట్ గా ఉందో చూడండి..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సిమ్రాన్ హీరోయిన్ గా రాజేంద్ర ప్రసాద్, అషిమా భల్లా కీలక పాత్రలు పోషించిన ‘డాడీ’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. మెగాస్టార్ కు ‘మాష్టర్’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సురేష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. అల్లు అరవింద్ నిర్మాత. అంతేకాదు ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్ కూడా తెరంగేట్రం చేసాడు. హీరో అతి మంచితనం వల్ల.. ఆస్తిని పోగొట్టుకుంటాడు.

అదే సమయంలో హీరోయిన్ అనారోగ్యం పాలవుతుంది.దాంతో ఆపరేషన్ చేయించడానికి డబ్బులు లేక తన కూతురు చనిపోతుంది. అయితే మళ్ళీ అదే పోలికలతో మరో పాప పుడుతుంది. స్టోరీలో బాగా హై ఎమోషనల్ యాంగిల్ ఉండడంతో మెగా ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని ఆదరించలేకపోయారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కొంతమేర చూడటంతో యవరేజ్ గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో అక్షయ పాత్ర పోషించిన పాప నటనకు చాలా మంచి పేరొచ్చింది.

ఆమె పేరు అక్షయ అనే అంతా ఫిక్సయిపోయారు.మెగాస్టార్ కు ఈమె నిజంగా కూతురే అన్నంత నేచురల్ గా నటించింది. తరువాత మాత్రం ఈమె మరో సినిమాలో నటించలేదు. అయితే ఈ పాప పేరు అనుష్క మల్హోత్రా. ‘డాడి’ సినిమా వచ్చి 19 ఏళ్ళు పూర్తి కావస్తుంది. ఈ పాప ఇప్పుడు పెద్దదై హీరోయిన్లను మించి గ్లామర్ గా తయారయ్యింది. ఈమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Leave a Reply