Ex MLA | మాజీ ఎమ్మెల్యే లీలలు.. వైరల్ అవుతున్న ఫిక్స్.

Ex MLA | ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్‌ నేత మదన్‌లాల్‌ ఓ మహిళతో సన్ని హితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.నిజానికి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఇప్పటికే జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది.ఖమ్మం జిల్లా వైరా టికెట్ ఎవరిని వరిస్తుందో ఆ నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓ మాజీ ఎమ్మెల్యే రాసలీలలు బయటకొచ్చాయి. వైరా బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ మరోసారి తనకే వస్తుందంటూ ధీమాగా ఉన్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కూడా టికెట్ తనకే వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు.మరో మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి కూడా టికెట్ తనకే వస్తుందని ధీమాగా ఉన్నారు. మదన్ లాల్ అనుచురులు మరో అడుగు ముందుకేసి టికెట్ పక్కా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మదన్ లాల్ కు ఎదురు దెబ్బ తగిలింది. మదన్ లాల్ కు సంబంధించి కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. మదన్ లాల్ ఓ మహిళతో చాలా సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరా నియోజకవర్గంలో కలకలం సృష్టిస్తున్నాయి. ఫేస్ బుక్, వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆయనకు టికెట్ రాకపొవచ్చని భావిస్తున్నారు.గార్ల బయ్యారంకు చెందిన వివాహితతో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కు వివాహేతర సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. భర్తతో దూరంగా ఉంటున్న 32 ఏళ్ల యువతితో ఆయన సన్నిహితంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి.

Leave a Reply