ఆ రోజు నై* ట్ కి వస్తావా అని అడిగిన వాళ్లే ఇప్పుడు… మాధవి లత కామెంట్స్,

సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే అక్కడ ఉన్న కొందరు బడా హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఇలా ఎవరో ఒకరు తమ అవసరాలను తీర్చుకోవడానికి ఏదో ఒకరకంగా మిగతా ఆర్టిస్టులను వాడుకోవాలని చూస్తుంటారు. ఎందుకంటే ఇండస్ట్రీలో అవకాశాల కోసం చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక్క అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు.

అలా నచ్చావులే సినిమాతో తెలుగు లో హీరోయిన్ గా పరిచయమైన మాధవి లత ఫస్ట్ సినిమాతోనే చాలా పెద్ద సక్సెస్ సాధించారు. ఈ సినిమాకి ముందు ఆమె కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు.అలాగే మహేష్ బాబు హీరోగా వచ్చిన అతిధి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా కూడా నటించారు. ఈ విధంగా మాధవి లత కెరియర్ స్టార్ట్ అయింది.అయితే ఆమె సినిమా కెరియర్ స్టార్ట్ చేసిన మొదట్లో ఆమెను ఒక డైరెక్టర్ విపరీతంగా వేధించేవాడట.

ఏదో ఒక రకంగా తనని వాడుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా.. వీలు కాకపోవడంతో తనని వదిలేశాడు. అయితే తాను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరైనా నిర్మాతనో.. మరో వ్యక్తో నాతో తప్పుగా మాట్లాడితే.. నేను అరవను. వారి మాటల వల్ల ఎంత కోపం వచ్చినా సరే.. శాంతంగానే బదులిస్తాను. నేను మీరు అనుకునే మనిషిని కాదండని చెప్పి వెళ్లి పోతాను. ముందు రోజు.. వస్తావా.. అని వంకరగా మాట్లాడిన వాళ్లే.. మరుసటి రోజు నుంచి నన్ను అమ్మ అని పిలిచిన వ్యక్తులు ఉన్నారు.

Leave a Reply