Mahashivratri 2024 | శివరాత్రికి ఇలా పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయట..

allroudadda

Mahashivratri 2024 | ఓం నమః శివాయ.. అంటూ శివనామ స్మరణంలో, శివభక్తి తత్పరతలో 24 గంటలూ పరవశించే పవిత్రమైన రోజు మహాశివరాత్రి పర్వదినం. ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది. ప్రతి పండుగకు వైజ్ఞాన శివరాత్రే యోగరాత్రి. శివరాత్రి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వమానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు. ఆచ‌రించ‌మ‌ని చెబుతారు.

ఉపవాసం..

మహాశివరాత్రి పర్వదినం సంద‌ర్భంగా శివరాత్రి జాగరణకు విశేష ప్రాధాన్యత ఉంది. ఉపవాసం అనగా దగ్గరగా ఉండడం అని అర్థం. భగవంతుడికి, మనస్సుకు, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఉపవాసం ఉన్న విష పదార్థాలను తొలగించడంతోపాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్లు కూడా తాగకుండా ఉండొద్దు.

ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుడి వైపు మనుస్సుని తిప్పడం కష్టం. అయితే ఉపవాసం నుంచి చిన్న పిల్లలకు, ముసలివాళ్లకు, గర్భవతులకు, ఔషధ సేవనం చేయాల్సిన వాళ్లకు మినహాయింపు ఉంది. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు. మద్యపానం చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ముందే లేచి చేసి ఈ రోజు తాను శివుడికి గొపీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి.

allroudadda
allroudadda

అభిషేకం..

శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసినా పొంగిపోతాడు. శివరాత్రిరోజు అర్పించడం, అభిషేకించడం వల్ల, సదాశివుడి అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుందని భక్తుల నమ్మకం.

జాగరణ..

శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తూనో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసేది అనబడదు. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మాట్లాడిన చెడు మాటల వల్ల పాపం వస్తుంది.

మంత్రజపం..

శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మహామంత్ర జపం లేదా స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది. శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదం తీసుకున్న అనంతరం భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. శివరాత్రినాడు ఉపవాసం, జాగరణ చేసినవారు తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

Leave a Reply