Mahesh Babu :  ఖరీదైన కారు కొన్న మహేష్ బాబు.. ధర తెలిస్తే మైండ్ బ్లాకే?

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల తనయుడు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో అతికొద్ది మంది మాత్రమే స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. నందమూరి, అక్కినేని, మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఇక వెండితెరపై ఎన్నో యాక్షన్ చిత్రాల్లో నటించి మెప్పించిన సూపర్ స్టార్ తనయుడు మహేష్ బాబు బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరిగా చెలామణి అవుతున్నారు.

అయితే ఇప్పటికే ప్రిన్స్ మహేష్ బాబు గ్యారేజీలో ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ గ్యారేజీలోకి మరో కోట్ల రూపాయల విలువ చేసే కారు వచ్చి చేరింది అన్నది తెలుస్తుంది. ఇటీవల మహేష్ బాబు గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ ఎస్వీ లేటెస్ట్ వర్షన్ కారును కొనుగోలు చేశారట. అయితే ఈ కారు ఖరీదు అక్షరాల 5.4 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. అయితే హైదరాబాద్లో గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కారు మహేష్ బాబుతే మొదటిది అని టాక్ వినిపిస్తుంది.

ఇక మహేష్ బాబు కొనుగోలు చేసిన కారు ధర గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్టులుక్ ఇప్పటికే విపరీతమైన ప్రేక్షకాదరణ పొందింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన యంగ్ సెన్సేషన్స్ శ్రీలీల హీరోయిన్గా నటిస్తూ ఉంది అని చెప్పాలి.

Leave a Reply