కొత్త బిజినెస్ లోకి మహేష్ ! కానీ వాళ్ళకి మాత్రమే,

టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు వ్యాపారంలో అడుగుపెట్టి ఎప్పటికప్పుడు కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నాడు.ఇప్పటికే ఓ వైపు నిర్మాతగా సినిమాలు తీస్తున్న మహేష్ బాబు మరో వైపు మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టాడు.ఇక త్వరలో తన పేరు మీద ఒక బ్రాండ్ ఫాషన్ దుస్తులని మార్కెట్ లోకి తీసుకొచ్చి ఫాషన్ వస్త్ర ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు.ఇప్పుడు వీటితో పాటు డిజిటల్ ప్లాట్ ఫాంలోకి కూడా ఎంటర్ అవుతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే డిజిటల్ ప్లాట్ ఫాంలో అమెజాన్, నెట్ ఫ్లిక్స్, జీ5, హాట్ స్టార్ లాంటి చానల్స్ ఉన్నాయి.

వీరు డిజిటల్ మీడియా ద్వారా మంచి ఆదాయం సంపాదిస్తున్నారు.భవిష్యత్తులో సినిమాలు అన్ని కూడా డిజిటల్ ప్లాట్ ఫాం లోకి వచ్చేసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటి నుంచే చాలా మంది గ్రహిస్తున్నారు.అందుకే నటులు అక్కడ కూడా వెబ్ సిరీస్ ల ద్వారా కెరియర్ బుల్డ్ చేసుకునే పనిలో ఉన్నారు.ఇప్పటికే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆహా ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఆ మధ్య టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, తన తోటి సీనియర్ హీరో నాగార్జునతో కలిసి ఓ సరికొత్త ఓటీటీ ప్లాట్ ఫాం ని స్థాపించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

ఇక తాజాగా మరో స్టార్ హీరో మహేష్ బాబు సైతం త్వరలోనే సొంతంగా ఒక ఓటీటీ ని రెడీ చేస్తున్నట్లు లేటెస్ట్ ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈమేరకు తన కూతురు సితార పేరిట ఒక ఓటీటీ ని మహేష్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.అయితే ఇది కిడ్స్ కి మాత్రమే సంబంధించిందిగా చెబుతున్నారు.మరి దీనిపై ఎలాంటి అఫిషియల్ అనౌన్స్మెంట్ లేనప్పటికీ.. ఇండ్రస్టీ లో ఈ వార్త జోరుగా వినిపిస్తోంది.

మరి నిజంగా మహేష్ బాబు తన కూతురు సితార పేరుతో ఓటీటీ ని ప్లాన్ చేస్తున్నాడా.. లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వరకు వేచి చూడాల్సిందే..ఇక ప్రస్తుతం మహేష్ సినిమా విషయానికొస్తే.. గీతా గోవిందం ఫేమ్ పరశురాం డైరెక్టన్లో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాదు.ఇప్పటికే దుబాయ్ లో ఓ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో మహేష్ సరసన మొదటిసారిగా కీర్తీ సురేష్ కథానాయికగా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్…!