నేను పవిత్రని పెళ్లి చేసుకోవడం మహేశ్ కి చాలా బాగా నచ్చింది.!

ఇటీవల కాలంలో నరేష్ పవిత్ర లోకేష్ లు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. నరేష్ తన మూడో భార్యతో గొడవలు పవిత్రతో రిలేషన్ షిప్ వంటి విషయాలు వారద్దరినీ ట్రెండింగ్ లో నిలిచేలా చేశాయి. అయితే మొన్నటి దాకా తాము స్నేహితులమే అని చెప్పిన నరేష్ పవిత్ర త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. నాలుగేళ్లుగా తాము సహజీవనం చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే వీరిద్దరూ కలిసి ముఖ్యంగా నరేష్ ఫ్యామిలీ పరువు తీస్తున్నారంటూ కొందరు వాదించారు. పెళ్లి చేసుకోకుండానే ఇలా చెట్టాపట్టాలేసుకొని తిరగడం ఇటీవల తీసిన సినిమాలోని కొన్ని సన్నివేషాలు అయితే వారిద్దరి బంధాన్ని వేలెత్తి చూపించేలా చేశాయి. అసలు వీరి బంధానికి సూపర్ స్టార్ ప్యామిలీ నుంచి సపోర్ట్ ఉందా లేదా అనే అనుమానాలు అందరిలోనూ కల్గాయి. వీటికి నరేష్ చెక్ పెట్టారు.

పవిత్రతో తన బంధానికి మిల్క్ బాయ్ మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తన తండ్రి కృష్ణతో పాటు సోదరుడు మహేష్ కు కూడా ముందు నుంచే ఈ బంధం గురించి తెలుసని వివరించారు. వారు తమ బంధానికి ఓకే చెప్పారని.. అందరికీ ఇష్టమే అన్నట్లుగా పేర్కొన్నారు. మహేష్ కృష్ణ అమ్మ విజయ నిర్మల తామంతా ఒకటే కుటుంబం అని స్పష్టం చేశారు…

Leave a Reply