నమ్రత రెస్టారెంట్‌లో ‘టీ’ ఖ‌రీదు తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు..!

ఏషియ‌న్ గ్రూప్ తో క‌లిసి థియేట‌ర్ చైన్ స్టార్ట్ చేశారు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు..కాగా ఇప్పుడు మ‌రో బిజినెస్ ని ఏషియ‌న్ గ్రూపుతో క‌లిసి ప్రారంభించారు. మహేష్ బాబు.. ఆయన భార్య నమ్రతతో రెస్టారెంట్ బిజినెస్‌లోకి అడుగు పెట్టించారు. ఏసియన్ గ్రూప్‌తో కలిసి థియేటర్‌ చైన్ స్టార్ట్ చేసిన మహేష్.. తాజాగా అదే గ్రూప్‌తో కలిసి ఈ రెస్టారెంట్‌ని ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్‌ను గురువారం నాడు ప్రారంభించారు.

ఈ రెస్టారెంట్‌కు ‘ఏఎన్’ అని నామకరణం చేశారు. ఏ అంటే ఏషియన్స్ అండ్ ఎన్ అంటే నమ్రత.AN రెస్టారెంట్స్ పేరుతో హైదరాబాద్‌లో మినార్వా కాఫీ హైట్స్ ఆఫ్ ప్లేసెస్ పేరుతో రెస్టారెంట్ బిజినెస్ మొదలు పెట్టారు. బుధవారం నాడు నమ్రత, ఎషియన్ సునీల్ సమక్షంలో పూజా కార్యక్రమాలు జరిగాయి, గురువారం గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఇప్పటికే ఎషియన్ సినిమాస్ భాగస్వామ్యంలో కలిసి మహేశ్ బాబు మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్నారు.

అయితే మ‌హేష్ రెస్టారెంట్‌లో తినాల‌ని ఆయ‌న అభిమానులు భావిస్తుండ‌గా, వారికి ప‌గ‌టిపూటే చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. స్నాక్స్ ఐటమ్స్ కు సైతం ధరలు వందల్లో ఉండడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. మెనూ ప్రకారం కేవలం రెండు ఇడ్లీలకు తో రూ.90 గా ఉంది. అదేవిధంగా మిరపకాయ బజ్జీలు ఒక్కప్లేట్ ధర రూ.125 గా కనిపిస్తుంది. అంతేకాకుండా ఒక కప్ టీ రూపాయలు 80 గా ఉంది.

Leave a Reply