మాజీ ప్రియుడుతో స్టార్ హీరోయిన్ రచ్చ..! వైరల్ వీడియో.

Malaika Arora: మన టాలీవుడ్ లో ఎప్పటికీ చిరకాలం గుర్తుండిపోయ్యే కొన్ని ఐటెం సాంగ్స్ ఉంటాయి, ఆ ఐటెం సాంగ్స్ ని ఎన్ని సార్లు విన్నా కూడా బోర్ కొట్టదు. మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది, అలాంటి ఐటెం సాంగ్స్ లో ఒకటి ‘కెవ్వు కేక’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఆరోజుల్లో ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.వరుస ఫ్లాప్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కి తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది ఈ చిత్రం.

ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకటి సాంగ్స్. ఈ చిత్రం లోని పాటలు సినిమా విడుదలకు ముందే సెన్సేషనల్ హిట్స్ గా నిలిచాయి. ఇక విడుదల తర్వాత ఆకాశమే హద్దు అనే రేంజ్ లో రీచ్ అయ్యింది జనాలకు. అయితే ఈ సినిమాలో చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలోళ్ల వరకు థియేటర్స్ లో పూనకాలు వచ్చినట్టు ఊగిపొయ్యెలా చేసిన పాట ‘కెవ్వు కేక’.

ఈ పాటలో పవన్ కళ్యాణ్ మామూలు జోష్ తో డ్యాన్స్ వెయ్యడు, ఆయనతో పాటుగా కలిసి చిందులేసిన నటి పేరు మలైకా అరోరా Malaika Arora. ఈమె మన టాలీవుడ్ ఆడియన్స్ కి పెద్దగా పరిచయం అయితే లేదు కానీ, బాలీవుడ్ లో మాత్రం పెద్ద ఫేమస్. అక్కడ ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది, ఎన్నో సినిమాల్లో ఐటెం సాంగ్స్ కూడా చేసింది. అంతే కాదు టెలివిజన్ లో ఎన్నో రియాలిటీ షోస్ కి హోస్ట్ గా కూడా వ్యవహరించింది మలైకా అరోరా.

ఇదిలా ఉంటే ఇటీవల Malaika Arora మలైకా ఆరోర బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ జన్మదినం సందర్భంగా..రెచ్చిపోయి డాన్స్ చేయడం జరిగింది. ఆ డాన్స్ వీడియోలు ఈ ముద్దుగుమ్మ వేసుకున్న డ్రెస్ చాలా ఆకర్షణీయంగా ఉండటంతో.. వీడియోస్ సోషల్ మీడియాలో రావడంతో భారీ ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. ఈ ముసలి హీరోయిన్ కి.. బాయ్ ఫ్రెండ్ అవసరమా..?, ఆ వయసులో అటువంటి బట్టలు ఏమిటి అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అర్జున్ కపూర్ కి జన్మదినం సందర్భంగా చాలా ఖరీదైన బహుమతులు ఇవ్వడం జరిగిందంట.

Leave a Reply