Malavika Mohan | మాళవిక మోహనన్ కొత్త తరహా విధ్వంసం..

allroudadda

Malavika Mohan | మాళవికా మోహన్.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. అందం, అభినయంతో నటిగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మాళవికా సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. తరచుగా తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను సామజిక మాధ్యమాలలో ఫోస్ట్ చేస్తూ ఉంటారు.

ఇలా యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.మొదట మోడలింగ్ రంగంలోకి ప్రవేశించిన ఈ కేరళ కుట్టి.. ఆ తరువాత తమిళనాట కథనాయికగా అడుగుపెట్టి.. రజనీకాంత్ సరసన పేట సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ తరువాత విజయ్ కు జంటగా మాస్టర్ మూవీలో నటించి మెప్పించింది. అయితే మాస్టర్ మూవీ హిట్ తో ఈ అమ్మడుకి వరస ఆవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇటివలే ధనుష్ తో మారన్ అనే చిత్రంలో కలిసి నటించింది.

allroudadda
allroudadda

ప్రస్తుతం విక్రమ్ హీరోగా నటించిన పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన తంగలాన్ ప్రాజెక్టులో మాళవికా నటించింది.ఇది కర్ణాటక రాష్ట్రం, కోలార్ లోని కేజీఎఫ్ నేపథ్యంలో సాగే చిత్రం. దీన్ని స్టూడియో గ్రీన్ పతకం పై కేఈ. జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా మాళవికా నటించగా.. మరో హీరోయిన్ గా పార్వతి నటిస్తోంది. తంగలాన్‌ షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

జనవరి 26వ తేదీన తంగలాన్‌ను విడుదల చేయున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఇక, అసలు విషయానికి వస్తే..నటి మాళవిక మోహన్ పెద్ద ఎత్తున జిమ్ లో కష్టపడుతూ వర్కౌట్ చేస్తున్నారు.ఈమె వివిధ రకాల వర్కౌట్స్ చేస్తూ చెమటలు వెళ్లకక్కెలా కష్టపడుతూ తనని తాను కాపాడుకుంటూ ఉన్నారు. ఇలా వివిధ రకాల యాంగిల్స్ లో జిమ్ లో కష్టపడుతూ ఉన్నటువంటి ఫోటోలను మాళవిక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

Leave a Reply