నరేశ్.. పవిత్రల ‘మళ్లీ పెళ్లి’ టీజర్ విడుదల..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి పవిత్ర లోకేష్.. నటుడు వీకే నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గడిచిన కొన్ని నెలల నుంచి వీరిద్దరి పేరు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతోంది. సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ సంపాదించారు. వీరిద్దరూ ప్రేమించుకొని మరి సహజీవనం చేస్తున్నారని వార్తలైతే వినిపించాయి. అయితే వీరిద్దరూ ట్రెండుకు తగ్గట్టుగా మారుతూనే ఉంటారు. దీంతో వీరిద్దరి ప్రేమాయణం మరొక రేంజ్ కు వెళ్ళిపోయింది.

ఈ ఏడాది మొదట్లో వీరిద్దరూ లిప్ కిస్ చేసుకుంటూ ఒక వీడియోను షేర్ చేయడంతో అది మరింత వైరల్ గా మారింది.ఆ తర్వాత వివాహమైందని ఒక వీడియోను కూడా షేర్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. ఇదంతా మళ్లీ పెళ్లి అనే సినిమా కోసమే అన్నట్లుగా తెలియజేయడం జరిగింది. నరేష్ ,పవిత్ర కాంబినేషన్లో ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఎం.ఎస్.రాజు తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇది వరకే ఈ సినిమాకు సంబంధించి కొన్ని పోస్టర్లు విడుదల కావడం జరిగింది. తాజాగా ఈ రోజున టీజర్ను కూడా విడుదల చేయడం జరిగింది.

ఈ టీజర్ కేవలం నరేష్ లైఫ్ గురించి మాత్రమే చూపించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా రమ్య రఘుపతి నరేష్ ల పెళ్లి తర్వాత పవిత్ర లోకేష్ తో స్నేహం ప్రేమ డేటింగ్ గురించి చూపించినట్లుగా తెలుస్తోంది.ఈ సినిమాలో పవిత్రా లోకేష్ నరేష్ తో పాటు వనితా విజయ్ కుమార్ జయసుధ శరత్బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే అనన్య నాగళ్ల రోషన్ రవివర్మ అన్నపూర్ణ భద్రం యుక్త ప్రవీణ్ యండమూరి మధు తదితరులు నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి మరియు అరుల్దేవ్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందించారు. అలాగే ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ జునైద్ సిద్ధిక్ ఎడిటర్ గా వ్యవహరించగా.. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు.

Leave a Reply