Manchu Lakshmi | ల్యాప్టాప్ లో అయోధ్య రామయ్యకు మంచు లక్ష్మి వెరైటీ పూజ..

allroudadda

Manchu Lakshmi | అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడు కొలువుదీరిన సంగతి తెలిసిందే. గర్భగుడిలో నిన్న జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసి యావత్ దేశం పులకించింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అక్కడ కొలువైన బాల రాముడిని ఇప్పటి వరకు రామ్ లల్లా అని పిలిచారు. ఇప్పుడు బాల రాముడి పేరును మార్చారు. ఇకపై రామ్ లల్లాను ‘బాలక్ రామ్’గా పిలవనున్నట్టు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు.

ఆలయంలో కొలువుదీరిన శ్రీరాముడు ఐదేళ్ల పసిబాలుడని… అందుకే బాలక్ రామ్ పేరును నిర్ణయించామని చెప్పారు. ఇకపై ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్ గా పిలుస్తామని తెలిపారు.అది పక్కన పెడితే ఇలా చాలామంది సెలబ్రిటీలు అయోధ్య వెళ్ళలేని పక్షం లో పూజలు చేయడం సోషల్ మీడియాలో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాని కి శుభాకాంక్షలు తెలపడం వంటివి చేశారు.

allroudadda
allroudadda

మంచు లక్ష్మి కూడా అయోధ్య రామయ్య కు ఇంట్లోనే పూజలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈమె అయోధ్య లో బాల రాముడు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నటువంటి సమయం లో ఇంట్లోనే ల్యాప్టాప్ లో లైవ్ చూస్తూ స్వామి వారి పై పువ్వులు చల్లుతూ హారతులు ఇస్తూ ఈ పూజ లను చేశారు.

హనుమాన్ హీరోయిన్ గురించి మీకు తెలియని నిజాలు.

ఇలా ఈమె వెరైటీ గా అయోధ్య రామయ్య కు పూజలు చేయడం తో ఈ వీడియో పై నేటిజన్స్ వివిధ రకాలు గా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మంచు లక్ష్మి ఏం మాట్లాడినా ఏ పని చేసినా అందరి దృష్టి ఆమెపై పడుతుందనే సంగతి తెలిసిందే. అయితే తాజా గా ఈమె షేర్ చేసిన ఈ వీడియో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దీంతో నేటిజన్స్ మంచు లక్ష్మి వీడియో పై విభిన్న రీతి లో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply