మంచు లక్ష్మి మొదటి భర్త ఎవరో తెలుసా..? అసలు ఎందుకు విడిపోయాడు?

మోహన్ బాబు వన్ అండ్ ఓన్లీ డాటర్ మంచు లక్ష్మి ఇండియాకు వచ్చే వరకు ఆమె గురించి తెలిసింది తక్కువే. ఫిల్మ్ సర్కిల్స్ తో పాటు సన్నిహితులకు మాత్రమే మంచు లక్ష్మి వ్యక్తిగత జీవితంలోని కోణాలు తెలుసు. ఈ జనరేషన్ కి తెలియని మరో విషయం ఆమెకు రెండు వివాహాలు జరిగాయి. వికీపీడియాలో ఆమె బయోగ్రఫీలో రెండో భర్త వివరాలు మాత్రమే ఉంటాయి. 90లలోనే మంచు లక్ష్మి వివాహం చేసుకుంది.

మొదటి భర్త పేరు కూడా శ్రీనివాసే. మంచు లక్ష్మి-శ్రీనివాస్ మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి.మంచు లక్ష్మి భర్త శ్రీనివాస్ ఈ గొడవల విషయంలో మోహన్ బాబును తప్పుబట్టడం విశేషం. ఆయన కారణంగానే మా వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పారు. అప్పట్లో మంచు లక్ష్మి భర్త శ్రీనివాస్ స్టేట్మెంట్ వార్తలకెక్కింది. మా కాపురంలో మామ మోహన్ బాబు చిచ్చు పెడుతున్నాడు అంటూ శ్రీనివాస్ ఆవేదన చెందాడంటూ కథనాలు వెలువడ్డాయి. కారణం ఎవరైనా ఇద్దరి మధ్య గొడవలు పెరగడం, విడాకులు తీసుకోవడం జరిగింది.

తర్వాత 2006లో చెన్నైకి చెందిన ఆండీ శ్రీనివాసన్ అనే వ్యక్తిని మంచు లక్ష్మి రెండో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి నిరాడంబరంగా జరిగినట్లు సమాచారం. వివాహమయ్యాక మంచు లక్ష్మి అమెరికా వెళ్లిపోయారు. అక్కడ కొన్ని టెలివిజన్ షోలు చేశారు. ఇంగ్లీష్ చిత్రాల్లో నటించారు. 2011లో ఇండియాలో అడుగుపెట్టిన మంచు లక్ష్మి అనగనగా ఓ ధీరుడు మూవీలో విలన్ రోల్ చేశారు. ఆ మూవీ అట్టర్ ప్లాప్.సరోగసీ పద్దతిలో ఓ పాపకు మంచు లక్ష్మి తల్లయ్యారు. ఆండీ శ్రీనివాస్ పేరుకే భర్త.

చాలా అరుదుగా వీరు కలుస్తారు. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది. చాలా ప్రాక్టికల్ అండ్ ఆర్టిఫిషియల్ గా వారి లైఫ్ ఉంటుంది. మంచు లక్ష్మి నటిగా, నిర్మాతగా పరిశ్రమలో స్థిరపడ్డారు. మంచు లక్ష్మి హీరోయిన్ కావాలని గట్టి ప్రయత్నాలు చేశారు.కానీ కుదరలేదు. తెలుగులో పలు టాక్ షోలకు హోస్ట్ గా వ్యవహరించారు. మంచు లక్ష్మి తరచుగా ట్రోల్స్ కి గురవుతారు. అవేమీ తాను పట్టించుకోనని మంచు లక్ష్మి అంటారు. వాటిని పట్టించుకునే మనం జీవితంలో ఏదీ సాధించలేమని కుండబద్దలు కొడతారు. ఇటీవల ఆమె మలయాళ చిత్రం మాన్స్టర్ లో కీలక రోల్ చేశారు. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన మాన్స్టర్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం సొంత బ్యానర్ లో ఓ మూవీ చేస్తున్నారు.

Leave a Reply