Manchu Manoj | మరోసారి తండ్రి కాబోతున్న మంచు మనోజ్..బేబీ బంప్ ఫోటోలు వైరల్

allroudadda

Manchu Manoj | టాలీవుడ్ స్టార్ హీరో మంచు మనోజ్‌ తన అభిమానులకు శుభవార్త తెలిపాడు. త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం తన భార్య భూమా నాగ మౌనిక రెడ్డి ప్రెగ్నెన్సీతో ఉందని వెల్ల‌డించాడు.ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా మ‌నోజ్ తెలుపుతూ.. “నా ప్రియమైన అత్తమ్మ, భూమా శోబా నాగిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ.. ఈ సంతోషకరమైన వార్తను అందరితో పంచుకుంటున్నా.

అత్తమ్మా, మామ.. మీరు మరోసారి అమ్మమ్మ, తాతయ్యలు అవ్వ‌బోతున్నారు. మా చిన్నారి ధైరవ్ అన్న కాబోతున్నాడు. ఈ సంతోషకరమైన సమయంలో పైనుంచి మీరు మీ ఆశీస్సులను మాకు అందిస్తూ.. మీ అశేష ప్రేమను మాపై కురిపిస్తూ ఉంటారు. మా అమ్మ నిర్మల, మా నాన్న మోహన్ బాబుల ఆశీస్సులతో, కుటుంబ సభ్యులం అందరి ప్రేమాభిమానాలతో ముగ్ధులమవుతున్నాం అంటూ” మ‌నోజ్ రాసుకోచ్చాడు. ఇక ఈ వార్త చూసిన అభిమానులు మనోజ్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

allroudadda

తాజాగా భూమా మౌనిక తన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో బేబీ బంప్ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది మౌనిక. మనోజ్ తో కలిసి దిగిన ఫొటోని కూడా షేర్ చేసింది.బేబీ బంప్ ఫోటోలు షేర్ చేస్తూ.. నా జీవితం, నా పక్కన ఉండే వాళ్ళతో ఎప్పుడూ నన్ను ఆకర్షిస్తుంది. నన్ను మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడేలా చేస్తుంది అంటూ మనోజ్ ని, తన మొదటి కొడుకు ధైరవ్ ని ట్యాగ్ చేసింది. ఈ పోస్ట్ కి మనోజ్ సరదాగా.. పిల్లా ఓ పిల్లా నువ్వంటే నాకు ప్రాణమే అని కామెంట్ చేసాడు. దీంతో భూమా మౌనిక బేబీ బంప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Recent Posts

Leave a Reply