Manchu Manoj | రెండో పెళ్లి మౌనికని అందుకే చేసుకున్నాను.. మనోజ్ కామెంట్స్.

ఇటీవల Manchu Manoj మంచు మనోజ్ – భూమా మౌనిక వివాహం జరిగింది. గతంలో ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యమే వీరి ప్రేమకి పునాది వేసిందని అంటారు. ఈ ఇద్దరూ కలిసి ఒక ఫంక్షన్లో మెరవడంతో ఈ విషయం బయటికి వచ్చింది. తమ గురించిన ఒక శుభవార్త త్వరలోనే చెబుతానని అక్కడి రిపోర్టర్ లతో మనోజ్ అన్నాడు. ఆ తరువాత ఆయన మోహన్ బాబును ఒప్పించి భూమా మౌనికను పెళ్లి చేసుకున్నాడు.

కుటుంబ సభ్యులతో పాటు వీరి వివాహానికి కొంతమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు.తాజాగా అలా మొదలైంది షోలో హోస్ట్ వెన్నెల కిషోర్ ఈ ప్రస్తావన తెచ్చారు.అహం బ్రహ్మస్మి మూవీ ఏమైందని అడిగారు. మనోజ్ సమాధానంగా… ఆ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాము. నా మిత్రుడు రామ్ చరణ్ ఓపెనింగ్ కి వచ్చాడు. అహం బ్రహ్మస్మి సినిమానా లేక మౌనికతో ప్రేమనా? అనే ఒక సందిగ్ధత పరిస్థితి ఏర్పడింది.

మౌనిక నేను చెన్నై పారిపోయాం..

ఈ రెంటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. నన్ను నమ్మి ఒక అమ్మాయి ఉంది. అలాంటప్పుడు డబ్బు కోసమో, కెరీర్ కోసమో నేను అటువైపు వెళితే బ్రతికినా వేస్ట్. అలా బ్రతకలేను కూడా. అందుకే నేను మౌనిక Mounika, బాబును ఎంచుకున్నాను.ఇక్కడ ఉంటే ఇబ్బంది అవుతుందని మౌనిక, బాబును తీసుకుని చెన్నై వెళ్లిపోయాం. అక్కడ ఏడాదిన్నర ఉన్నాం. ఈ విషయం ఎవరికీ తెలియదు.

ఐతే పెళ్ళికి ముందు మౌనికతో మనోజ్ సహ జీ ? వనం చేసినట్లు ఆయన పరోక్షంగా ఒప్పుకున్నారు. భూమా మౌనికకు మొదటి భర్తతో ఒక కొడుకు పుట్టాడు. ఆ కుర్రాడి పేరు ధైరవ్ రెడ్డి. మౌనికను మోహన్ బాబు వ్యతిరేకించడానికి ఇది కూడా కారణం కావచ్చు. మౌనిక కొడుకును మంచు విష్ణు, మోహన్ బాబు ఒప్పుకోకపోయి ఉండొచ్చు. కానీ మనోజ్ వారందరితో యుద్ధం చేసి మౌనికను దక్కించుకున్నాడు. కోరుకున్నట్లు మౌనికను భార్యగా తెచ్చుకున్నారు.

Leave a Reply