allroudadda

Manchu Vishnu | క‌న్న‌ప్ప చిత్రం కోసం కండలు పెంచిన మంచు విష్ణు..

Manchu Vishnu | కన్నప్ప మంచు విష్ణు ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు..బడ్జెట్‌ గురించి ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఎంతో భారీగా గ్రాండ్ గా వుండే విధంగా జాగ్రత్త పడుతున్నారు. చిత్రం లో క్యాస్టింగ్‌ విషయంలో అలాగే వీఎఫ్ఎక్స్ విషయం లో ఎక్కడా కంప్రమైజ్‌ కావడం లేదు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమం లో కన్నప్ప మూవీ గురించి మంచు విష్ణు కీలక అప్‌డేట్‌ ను ఇచ్చాడు. అంతేకాదు ఈ సినిమా లో ప్రభాస్‌ పాత్ర గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. కన్నప్ప సినిమా విడుదల కోసం సౌత్‌లోనే కాదు నార్త్‌ ఆడియన్స్‌ కూడా అడుగుతున్నారని మంచు విష్ణు చెప్పాడు. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు 60 శాతం పూర్తయ్యిందని.. తొందరలోనే మిగతా పార్ట్‌ షూటింగ్‌ కంప్లీట్‌ చేస్తామని తెలిపాడు. ఈ ఏడాది చివరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపాడు.

allroudadda
allroudadda

త్వరలోనే కన్నప్ప గ్లింప్స్‌ విడుదల చేస్తామని మంచు వారబ్బాయి చెప్పాడు. అంతేకాదు ప్రభాస్‌ రోల్‌ గురించి కూడా చిన్న హింట్‌ ఇచ్చాడు. ఈ సినిమాలో ప్రభాస్‌ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని అన్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడే చెబితే థ్రిల్‌ ఉండదని.. సమయం వచ్చినప్పుడు తానే వెల్లడిస్తానని అన్నాడు. మరో నెలలో న్యూజిలాండ్‌ వెళ్లాలని.. మిగిలిన షూటింగ్‌ కూడా అక్కడే కంప్లీట్‌ చేస్తామని చెప్పాడు. అంతేకాదు ఈ సినిమాలో తన తండ్రి మోహన్‌బాబుతో పాటు తన కొడుకు అవ్రామ్‌ కూడా నటిస్తున్నాడని తెలిపాడు.

ఫ్యాన్స్ కి తెలుగులో గుంటూరు కారం నా చివరి సినిమా.. మహేశ్ షాకింగ్ కామెంట్స్,

Leave a Reply