Manobala: స్టార్ కమెడియన్ మనోబాలా కన్నుమూత..! కారణం ఇదే.

తమిళ హాస్య నటుడు మనోబాలా (69) కాసేపటి క్రితమే కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన కాసేపటి క్రితమే మరణించారు. లివర్ సమస్యలతో ఆయన తుది శ్వాసవిడిచినట్టు తెలుస్తోంది.

ఆయన మృతి పట్ల కోలీవుడ్ సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే మనోబాల గురించి ఇలాంటి వార్త వినడంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఎన్నో తమిళ సూపర్ హిట్ సినిమాల్లో నవ్వులు పూయించిన ఆయన ఇప్పుడు అందరినీ కన్నీళ్లలో ముంచెత్తారని అభిమానులు బాధపడుతున్నారు.

తమిళంలో మనోబాల ఎంత ఫేమస్సో తెలుగులోనూ అంతే ఫేమస్. డబ్బింగ్ సినిమాలతో ఆయన ఇక్కడి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన కామెడీ టైమింగ్‌కు అందరూ ఫిదా అవుతుంటారు. తమిళ స్టార్ హీరోల సినిమాల్లో మనోబాలా కచ్చితంగా ఉంటాడు. విజయ్, రజినీ ఇలా అందరితోనూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించాడు.

Leave a Reply