భార్యపై మంచు మనోజ్ ఎమోషనల్ కామెంట్స్!

మంచు మనోజ్ గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. మొదటి భార్యకు గతంలో విడాకులు ఇచ్చి ఇటీవలే తన రాబోయే సినిమాని ప్రకటించి రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు.ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికని మార్చ్ 3 శుక్రవారం రాత్రి వివాహం చేసుకున్నాడు మనోజ్. వీరిద్దరిది ప్రేమ వివాహం కావడంతో, ఇద్దరికీ రెండో పెళ్లి కావడంతో హైదరాబాద్ లోని మనోజ్ ఇంట్లోనే చాలా సింపుల్ గా వివాహం జరిగింది.

వివాహం తర్వాత మౌనిక సొంతూరు ఆళ్లగడ్డకు వెళ్లారు. ఆ తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ వార్షికోత్సవంలో మొదటిసారి ఈ జంట బయట కనపడ్డారు. తాజాగా ఈ జంట మొదటిసారి ఒక టీవీ షోకి వచ్చారు. మంచు మనోజ్, వెన్నెల కిషోర్ మంచి స్నేహితులు. దీంతో షోకి కిషోర్ పర్సనల్ గా పిలవడంతో మనోజ్ తన భార్యతో కలిసి వచ్చినట్టు సమాచారం. మనోజ్ పెళ్లి వార్తల్లో బాగా హైలెట్ అయింది.

దీంతో ఈ జంట ఇలా టీవీ షోకి రావడంతో మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అలా మొదలైంది మనోజ్ మౌనిక ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చూశాక ఎపిసోడ్ లో వీరు అనేక విషయాలు, వీరి ప్రేమ గురించి, గొడవల గురించి కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది.ఇద్ద‌రిలో ఎవ‌రు రొమాంటిక్ అని ప్ర‌శ్నిస్తే.. మ‌నోజ్ తానే అని ఒప్పుకున్నాడు. `అమ్మ చనిపోయాక ఆమె బర్త్ డే రోజు ఆలోచిస్తూ బాధ‌గా ఉన్నాను.

అంతలో మనోజ్ వ‌చ్చాడు.. నా బాధ‌ను పోగొట్టాడు. ఆ రోజే మ‌నోజ్ తో ప్రేమ‌లో ప‌డ్డానుఅంటూ మౌనిక ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చింది. ఇక మ‌నోజ్ మాట్లాడుతూ.. తాను, మౌనిక ఒక‌టి కావ‌డానికి పెద్ద యుద్ధ‌మే చేశామ‌ని.. ఎన్నో సంవత్సరాలు దేశదేశాలు తిరుగుతూ వనవాసం చేశాం. అన్నీ డోర్లు మూసేసినా మేము వెన‌క్కి త‌గ్గ‌లేదు అని మ‌నోజ్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

Leave a Reply