మంచు మనోజ్ మొదటి భార్య.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

కొన్ని గంటల క్రితం మనోజ్, భూమా మౌనికల వివాహం గ్రాండ్ గా జరిగిందనే సంగతి తెలిసిందే. మనోజ్, మౌనికల పెళ్లిని చూసి ఇద్దరి అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. కలకాలం ఈ జంట సంతోషంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. త్వరలో ఈ జంట మరిన్ని శుభవార్తలు చెప్పాలని ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

అదే సమయంలో మంచు మనోజ్ నుంచి విడాకులు తీసుకుని వేరుపడిన మొదటి భార్య ప్రణీత రెడ్డి ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అన్న విషయం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. మంచు మనోజ్ నుంచి విడాకులు తీసుకున్న తరువాత ప్రణీత రెడ్డి అమెరికాకు వెళ్లి పోయినట్లు తెలుస్తోంది.

అక్కడ ఈమె ఒక ఇల్యూస్ట్రేషన్ ఆర్టిస్టుగా తన పనిలో బిజీగా ఉందట. సింగల్ లైఫ్ ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మంచు మనోజ్ ప్రణీత రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే. కథ వివాహమైన కొంతకాలానికి వీరు మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి అన్న వార్తలు వినిపించాయి.. తర్వాత వీరు విడిపోయారు అనే వార్తలు వచ్చాయి. చివరికి ఈ వార్తలు నిజమయ్యాయి.

Leave a Reply