కీర్తి సురేష్ ని మించిపోయిన ఇంద్రజ…! ఈ వయస్సు లో అదేమీ ఎనర్జీ రా బాబు. వైరల్ వీడియో

ఇటీవల కాలం లో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఊపేసిన సాంగ్స్ ఏదైనా ఉందా అంటే అది దసరా సాంగ్స్ అనే చెప్పాలి. ఇంస్టాగ్రామ్ రీల్స్ మొత్తం ఎక్కడ చూసిన ‘చమ్కీల అంగీలు వేసి’ అనే సాంగ్ ట్రెండ్ అవుతూ ఉంటుంది. దీనితో పాటు ‘దసరా’ చిత్రం లో పెళ్లి తర్వాత వచ్చే ఒక ఊర మాస్ బీట్ కి కీర్తి సురేష్ వేసిన డ్యాన్స్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ బిట్ కూడా ఇంస్టాగ్రామ్ రీల్స్ లో ట్రెండ్ అవుతూనే ఉంది.

అయితే ఇప్పుడు మాస్ బీట్ కి ప్రముఖ సీనియర్ హీరోయిన్ ఇంద్రజ కూడా దుమ్ము లేపే స్టెప్స్ తో అదరగొట్టేసింది.ప్రతీ ఆదివారం ఈటీవీ ఛానల్ లో ప్రసారం అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం కి జడ్జి గా ఇంద్రజ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రాం కూడా పెద్ద హిట్ అయ్యింది.తాజాగా కీర్తి సురేష్ నాని )జంటగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం దసరా.

సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మార్చి 30 తేదీ విడుదల అయ్యి 100 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది.ఇక ఈ సినిమాలో ఎంతో పాపులర్ అయిన చమ్కీల అంగిలేసి సాంగ్ సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అయింది.ఈ సాంగ్ సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవ్వడమే కాకుండా కీర్తి సురేష్ మాస్ పర్ఫామెన్స్ కు అందరూ ఫిదా అయ్యారు.

అయితే తాజాగా ఇదే పాటకు నటి ఇంద్రజ సైతం కాలు కదిపారు.బుల్లితెరపై పలు కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తున్నటువంటి ఇంద్రజ తాజాగా ఓ కార్యక్రమంలో ఈ పాటకు మాస్ స్టెప్పులతో అదిరిపోయిన పర్ఫామెన్స్ ఇచ్చారు.ఇలా ఇంద్రజ కీర్తి సురేష్ ను మించిపోయి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో వైరల్ గా మారడంతో నేటిజన్స్ ఇంద్రజ పెర్ఫార్మెన్స్ కి ప్రశంసలు కురిపిస్తున్నారు.ఎలా ఉందో మీరు కామెంట్ లో తెలియచెయ్యండి,

Leave a Reply