మెక్ డొనాల్డ్స్ యాడ్ కోసం తారక్ పారితోషికం తెలిస్తే షాక్ ?

జూనియర్ ఎన్టీఆర్ (jrntr)పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మార్మోగింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. కాగా, ప్రస్తుతం ఆయన సినిమాలు చేస్తూనే మరోపక్క వరుస పెట్టి కమర్షియల్ యాడ్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే పలు యాడ్స్ చేసిన ఎన్టీఆర్..తాజాగా ఎన్టీఆర్ త‌న మిత్రుల‌తో క‌లిసి చికెన్ తినేందుకు ఓ చోటుకు వెళ్లారు. చికెన్ తినేందుకు సిద్దం అయ్యారు.

ఇంత‌లో అక్క‌డ‌కు ఓ మేనేజ‌ర్ వ‌చ్చాడు. సారీ సార్ ఇది క్లోజింగ్ టైమ్ అని చెబుతూ త‌న చేతికి ఉన్న గ‌డియారాన్ని చూపించాడు. వెంట‌నే ఎన్టీఆర్ కు ఓ సూప‌ర్ ఆలోచ‌న వ‌చ్చింది. అగ్గిపెట్టె అందుకుని అందులోంచి ఓ అగ్గి పుల్ల‌ను వెలిగించాడు. దాన్ని చంద్రుడికి అంటించాడు. ఇంకేముంది చంద్రుడు కాస్త సూర్యుడిగా మారిపోయాడు. వెంట‌నే ఇది ఓపెనింగ్ టైమ్ అంటూ యంగ్ టైగ‌ర్ చెప్పాడు. అంద‌రూ క‌లిసి చికెన్ తిన్నారు.

ఇది ఏదో సినిమాలోని ఓ సీన్ అనుకోకండి మెక్ డొనాల్డ్స్ mcdonalds కొత్త యాడ్‌.మెక్ డొనాల్డ్స్ కంటే ముందు ఎన్టీఆర్ లీషియస్, యాపీ ఫిజ్ రెండు యాడ్స్ చేసాడు. ఆ రెండూ కూడా ఫుడ్ యాడ్స్ కావడం విశేషం. ఫస్ట్ Appy Fizz డ్రింక్ కోసం ఎన్టీఆర్ యాడ్ చేశారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే ఇంటికి మీట్ డెలివరీ చేసే లీషియస్ కోసం ఓ యాడ్ చేశారు. ఇప్పుడు మెక్ డొనాల్డ్స్ యాడ్ చేశారు.ఈ యాడ్ కోసం తారక్ 2 కోట్లు తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి..

Leave a Reply