Meena: మీనా పెళ్ళికి ముందు గాఢంగా ప్రేమించిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా..?

బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. 20కి పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మీనా ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగింది. నవయుగం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మీనా.. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది.

దాదాపు రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన మీనా.. 2009లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్ ను వివాహం చేసుకుంది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ఆమె పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఒక పాప కూడా పుట్టింది. అయితే గత ఏడాది జూన్ లో ఈమె భర్త మృతి చెందాడు. భర్తను కోల్పోయిన దుఃఖం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది మీనా. బాధను మర్చిపోవడం కోసం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది.

ఇదిలా ఉంటే మీనా ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్ళు అయ్యింది. ఈ సందర్భంగా ఆమె ఓ తమిళ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.పెళ్లికి ముందు ఆమెకు హృతిక్‌రోషన్‌ మీద క్రష్ ఉండేదని, అలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని వాళ్ల అమ్మతో చెప్పినట్లు ఇంటర్వూలో వెల్లడించింది. అదేకాకుండా హృతిక్‌ పెళ్ళి రోజున తన మనసు విరిగిపోయిందని చెప్పుకొచ్చింది.అయితే హృతిక్ రోషన్ కి 2000వ సంవత్సరంలో పెళ్లి జరిగింది.

Leave a Reply