చిలిపి పోజులతో మెస్మరైజ్ చేస్తున్న మీరా జాస్మిన్..!

‘భద్ర’, ‘గుడుంబా శంకర్‌’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అందాల భామ మీరా జాస్మిన్ . కెరీర్ పీక్‌లో ఉండగా పెళ్లి చేసుకున్నారు. అనంతరం సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. ఈ మలయాళీ బ్యూటీ దాదాపుగా పదేళ్ల తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. కొన్ని రోజుల క్రితం మీరా జాస్మిన్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకొంటున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

అప్పటి నుంచి అభిమానులందరు ఆమె ఏ సినిమా చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు తెర దించుతూ తాజాగా ఆమె నటించే సినిమా పేరు బయటికి వచ్చింది. మీరా జాస్మిన్ ‘విమానం’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుంది. మీరా జాస్మిన్ ‘అమ్మాయి బాగుంది’ తో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.

బాలకృష్ణ, పవన్ కల్యాణ్, రవితేజ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. చివరగా ‘మోక్ష’ (Moksha) లో నటించారు. ఈ చిత్రం 2013లో విడుదలైంది. అనంతరం ఏ తెలుగు చిత్రంలోను ఆమె కనిపించలేదు.ఇందులో భాగంగానే తాజాగా ఈ భామ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.

( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )

Leave a Reply