Chiranjeevi Konidela | పద్మ విభూషణ్ రావడంతో కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి

allroudadda

Chiranjeevi Konidela | మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రబుత్వం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. తెలంగాణలో చిందు యక్షగానం కళను కాపాడుతున్న గడ్డం సమ్మయ్యతోపాటూ బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప, ఎం వేలు ఆనందాచారి (ఆర్ట్), కేతావత్ సోమ్‌లాల్ (సాహిత్యం, విద్య), కూరెళ్ల విఠలాచార్య (సాహిత్యం, విద్య)ను పద్మశ్రీ వరించింది.తమిళ నటుడు, DMDK అధినేత విజయ్ కాంత్‌కి పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది.

ఆయన ఇటీవలే మరణించారు. పద్మ అవార్డుల జాబితాను కేంద్రం రిలీజ్ చేసింది. దేశంలో అత్యున్నత పురస్కారం భారత రత్న కాగా.. ఆ తర్వాత పద్మ విభూషణ్ ఉంది. తర్వాత పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. ఏటా కేంద్రం ఈ అవార్డులను ప్రకటిస్తోంది.ఈ సంవత్సరం 12 మందిని ఈ అవార్డులకు ఎంపిక చేసింది కేంద్రం. ఎంపికైన వారిలో ఒకరు భారతరత్న, ఐదుగురు పద్మవిభూషణ్, 17 మంది పద్మభూషణ్ పొందుతారు.

allroudadda
allroudadda

మిగతావారికి పద్మశ్రీ అవార్డులు వస్తాయి.1978లో నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన అలుపెరగకుండా సినిమాలు చేశారు. చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్‌ ప్రకటించడంపై చిరంజీవి ఓ వీడియో ద్వారా స్పందించారు. ఆయన మాట్లాడుతూ ’కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్‌ ప్రకటన విన్న తర్వాత ఏం మాట్లాడాలో కూడా మాటలు రావడం లేదు.

Also Read : 30 ఏళ్లుగా చిరంజీవికి డూప్ గా చేస్తున్న వ్య‌క్తి ఎవ‌రో తెలుసా..?

మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబ సభ్యుల అండ దండలు, నీడలా నాతో నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగా నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నా.’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. మెగాస్టార్‌కు పద్మ విభూషణ్‌ రావడం పట్ల మెగా కోడలు ఉపాసన హర్షం వ్యక్తం చేసింది. తన మావయ్యకు అభినందనలు చెబుతూ ట్వీట్‌ చేసింది.

Leave a Reply