కొత్త కారు కొన్న మెహబూబ్ ఎన్ని లక్షల్లో తెలుసా?

మెహబూబ్ బుల్లితెర మీద ఎన్నో షోస్ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. కవర్ సాంగ్స్ చేస్తూ, షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ లోకి వెళ్ళాక తెలుగు ఆడియన్స్ కి చాలా దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఆయన కెరీర్ మంచి స్పీడ్ లోనే వెళ్తోంది. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక యూట్యూబ్ కంటెంట్ తో ఫుల్ బిజీ అయ్యాడు.

అంతలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో బీబీ జోడి అనే షో స్టార్ట్ చేసేసరికి అందులో శ్రీ సత్యతో కలిసి జోడి డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో ఇరగదీసాడు మెహబూబ్. అలాంటి మెహబూబ్ ఈ ఏడాది రంజాన్ మాసంలో మంచి కార్ ని కొన్నాడు. రూ.15 లక్షల రూపాయలు విలువ చేసే మహీంద్రా ఎక్స్ యూవి 700 కారు(Mahindra XUV 700 car )ని కొనుగోలు చేశాడు.

నలుపు రంగులో ఉన్న ఆ కారు వద్ద నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు మెహబూబ్.అనంతరం ఆ సంతోష క్షణాలను ఫ్రెండ్స్ తో కుటుంబ సభ్యులతో పంచుకున్నారు.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు ప్రముఖులు అభిమానులు నెటిజన్స్ పెద్ద ఎత్తున మెహబూబ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.ఇప్పటికే సొంతింటి కలను నెరవేర్చుకున్న మెహబూబ్ తాజాగా సొంత వాహనం కూడా కొనుగోలు చేయడంతో పట్టరాని సంతోషంతో కనిపించాడు.

Leave a Reply