Minister Roja | కూతురుతో కలిసి పబ్ లో రచ్చ చేసిన మంత్రి రోజా .. నెటిజన్స్ ట్రోల్

allroudadda

Minister Roja | ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నగరి నియోజకవర్గం ప్రత్యేకమైనది. వైసీపీకి ఇంకా స్పెషల్ సీటు అని చెప్పాలి. ఎందుకంటే 2014, 2019లలో ఈ సీటుని వైసీపీ గెలుచుకుంది. వైసీపీ తరఫున సినీ నటి ఆర్కే రోజా ఎమ్మెల్యే అయ్యారు. ఆమె మంత్రిగా కూడా ఉన్నారు. రోజా టీడీపీ నుంచి రెండు సార్లు పోటీ చేస్తే రెండు సార్లూ ఓటమి పాలు అయ్యారు. పైగా ఐరన్ లెగ్ అని అక్కడ పేరు తెచ్చుకున్నారు. కానీ వైసీపీ ఆమె జాతకాన్ని మార్చేసింది. ఆమె గోల్డెన్ లెగ్ కూడా అయ్యారు.

ఇదిలా ఉంటే ఇపుడు ముచ్చటగా మూడవసారి రోజా నగరి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే నగరి నియోజకవర్గంలో రోజా పట్ల వ్యతిరేకత ఉంది అని అంటున్నారు. దాంతో ఆమెకు టికెట్ ఈసారి ఇవ్వకపోవచ్చు అని అంటున్నారు. మరి ఎవరికి ఇస్తారు అంటే అక్కడే ఉంది ట్విస్ట్.నగరి నియోజకవర్గానికి చెందిన రెడ్డివారి చక్రపాణిరెడ్డికి ఈ సీటు ఖరారు అవుతోంది అని అంటున్నారు.

Minister Roja | బెంగళూరు పబ్బుల్లో చిందులు..

allroudadda
allroudadda

ఆయన శ్రీశైలం దేవస్థానం చైర్మన్ గా ఉన్నారు. పైగా ఆయన నగరిలో పట్టున నాయకుడు. పక్కా లోకల్. వైసీపీలో ఎక్కువ మంది ఆయన ఎమ్మెల్యే అభ్యర్ధి కావాలని కోరుకుంటున్నారు అని అంటున్నారు.ఆ సంగతి కాసేపు పక్కన పెడితే నూతన సంవత్సర వేడుకలను మంత్రి రోజా ఘనంగా జరుపుకున్నారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి బెంగళూరులో న్యూ ఇయర్ కు ఘనంగా స్వాగతం పలికారు.

Also Read : మరోసారి మంత్రి రోజాపై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు .

బెంగళూరు పబ్బులో డాన్సులు చేస్తూ పాటలకు స్టెప్పులు వేస్తూ న్యూ ఇయర్ వేడుకలను ఆస్వాదించారు. అయితే బెంగళూరు పబ్బులో రోజా డాన్స్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మంత్రిగా ఉండి పబ్బులో డాన్స్ లు ఏంటి అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు రోడ్లపై నిరసనలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఇవేమీ పట్టవా..? బెంగళూరు పబ్బుల్లో చిందులు వేస్తారా అంటు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

Leave a Reply