Lasya Nanditha | రోడ్డు ప్రమాదంలో లాస్య మృతి.. షాక్ లో అభిమానులు

allroudadda

Lasya Nanditha | కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) మృతి చెందారు. పటాన్‌చెరు సమీపంలో ఓఆర్ఆర్‌ (ORR)పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.దీంతో లాస్య నందిత అక్కడికక్కడే మరణించారు. లాస్య 1987లో హైదరాబాద్‌లో జన్మించారు. కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తిచేశారు. అనంతరం 2015లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదేఏడాది జరిగిన కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు.

2016లో తన తండ్రి, అప్పటి ఎమ్మెల్యే సాయన్నతోపాటు బీఆర్‌ఎస్‌లో చేరారు. 2016-20 మధ్య కవాడిగూడ కార్పొరేటర్‌గా పనిచేశారు. 2021లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి పోటీచేసి ఓటమి చవిచూశారు. తండ్రి మరణంతో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్‌ నుంచి పోటీచేసి విజయం సాధించారు.అసలు విషయానికి వస్తే సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nanditha) కన్నుమూశారు.

allroudadda
allroudadda

ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతిచెందారు. పటాన్‌చెరూ సమీపంలో ఓఆర్‌ఆర్‌పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే మరణించారు. కారు డ్రైవర్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్‌ను దవాఖానకు తరలించారు. దైవదర్శనానికి వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది.

Recent Posts

Leave a Reply