YSRCP MLA | అందరిలా బూతులు మాట్లాడ‌క‌పోవ‌డం వలనే టికెట్ ఇవ్వలేదు..

allroudadda

YSRCP MLA | పెనమలూరు ఎమ్మెల్యే, వైసీపీ నేత‌ కొలుసు పార్థసారధి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న శుక్ర‌వారం మీడియాతో మాట్లాడుతూ.. నాకు ఏ అర్హత లేదని మంత్రి పదవి ఇవ్వలేదో తెలియదని.. ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు చేయకపోవడమే నా అసమర్థతా.? అసభ్య పదజాలం వాడకపోవడమే నా అసమర్థతా.? అని వైసీపీ అధిష్టానాన్ని ప్ర‌శ్నించారు. వైసీపీలో బీసీలకు అగ్రతాంబూలం అనేది నేతి బీరకాయలో నెయ్యి చందమేన‌ని అధిష్టానంపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు.

పెనమలూరు నుంచి తనను కాద‌ని వైసీపీ గెలిచే పరిస్ధితి లేని గన్నవరం సీటుకు వెళ్లమన్నారని పార్ధసారధి వెల్లడించారు. తాను బీసీ నేతను కాబట్టి అక్కడ ఓడినా ఫర్వాలేదని అనుకున్నట్లున్నారన్నారు. కానీ తాను ఇందుకు ఒప్పుకోలేదన్నారు. బలహీన వర్గాలకు వైసీపీలో గుర్తింపు ఉంటుందని గతంలో చెప్పాను.. అది తప్పని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదన్నారు.

allroudadda
allroudadda

బీసీలు, ఎస్సీలు ఎవరి కాళ్లపై వారు నిలబడాలనుకుంటారని.. వారు మరొకరి పెత్తనంపై ఆధారపడాల్సి వస్తే నాలా ఆత్మాభిమానం చంపుకోరని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారధి నేడు సమావేశం కానున్నారు. పెనమలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్థసారధి టీడీపీలో చేరతారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది.

 ఈ ఫొటోలో స్టార్ హీరోయిన్ ఎవ‌రో చెప్పుకోండి !

ఆ ప్రచారాన్ని నిజం చేస్తున్నట్లుగానే ఆయన టీడీపీ నేతలకు టచ్ లోకి వెళ్లారు. ఆయన మరోసారి పెనమలూరు నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని పార్థసారధి అనుచరులు చెబుతున్నారు.అదే సమయంలో పెనమలూరు వైసీపీ ఇన్‌ఛార్జిగా జోగి రమేష్ ను నిన్న అధిష్టానం నియమించడంతో పార్థసారధి క్విట్ దాదాపుగా ఖాయమయినట్లే కనిపిస్తుంది. చంద్రబాబుతో భేటీ తర్వాత ఆయన పెనమలూరు నుంచి పోటీ చేస్తారా? లేదా నూజివీడు నుంచి బరిలోకి దిగుతారా? అన్న దానిపై స్పష్టత రానుంది.

Leave a Reply