MlA perni nani | పాపం జగన్ సభ కోసం బస్సు డ్రైవర్‌గా మారిన పేర్ని నాని..!

allroudadda

MlA perni nani | ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ లు వ్యూహాలు రచిస్తున్నాయి. అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఇరుపార్టీలూ ఉన్నాయి. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో వైఎస్సార్ సీపీ చాలా దూకుడుగా ఉంది. ఇప్పటికే నియోజవర్గాల ఇన్ ఛార్జీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అలానే ఇటీవలే భీమిలిలో సిద్ధం సభలో వైఎస్సార్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారభించారు.

తొలి సభతోనే ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తేలా సీఎం జగన్ స్పీచ్ అదరగొట్టారు. తాజాగా ఏలూరు సిద్ధం సభకు జనాల్ని తీసుకెళ్లే బాధ్యతను మాజీ మంత్రి పేర్ని నాని తీసుకున్నారు. స్వయంగా ఆయనే బస్సు నడపడం విశేషం. నేడు ఏలూరు-దెందులూరు మధ్య ఉన్న సహారా గ్రౌండ్స్ లో సీఎం జగన్ సిద్ధం సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఆ సభ కోసం మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని బస్సు డ్రైవర్ గా మారారు.

allroudadda
allroudadda

ఆయన మచిలీపట్నం నుంచి వైసీపీ కార్యకర్తలతో కూడిన బస్సును స్వయంగా నడుపుతూ ఏలూరు తీసుకెళ్లారు. ఈ బస్సులో పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు (పేర్ని కృష్ణమూర్తి) కూడా ఉన్నారు. పేర్ని కిట్టుకు మచిలీపట్నం వైసీపీ టికెట్ ఇచ్చింది. పేర్ని నాని గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన నేషనల్ హైవేపై ఎలాంటి తడబాటు లేకుండా సాఫీగా బస్సు నడిపారు. వైసీపీ లోగో ఉన్న టీషర్టు, వైసీపీ రంగులున్న టోపీ ధరించిన పేర్ని నాని రోడ్డుపై వెళ్లే ఇతర వాహనాల్లోని వారికి అభివాదం చేస్తూ ఉత్సాహంగా కనిపించారు.

Leave a Reply