చావు బతుకుల మధ్య బలగం మొగిలయ్య…ఆదుకోండి అంటూ…!కన్నిరూ

వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన పస్తం మొగిలయ్య.. ఊరూరా తిరుగుతూ బుర్ర కథలను గానం చేస్తూ బతుకు బండి నడిపిస్తున్నారు. మొగిలయ్య, కొమురమ్మ దంపతులు బలగం సినిమాలో నటించారు. భార్యాభర్తలిద్దరూ నిరక్షరాస్యులే అయినా సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు కథలు, పాటలు రాయడం వారి ప్రత్యేకత. ప్రస్తుతం కడు పేదరికంలో కాలం వెళ్లదీస్తున్నారు మొగిలయ్య దంపతులు.వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన పస్తం మొగిలయ్య..

ఊరూరా తిరుగుతూ బుర్ర కథలను గానం చేస్తూ బతుకు బండి నడిపిస్తున్నారు. మొగిలయ్య, కొమురమ్మ దంపతులు బలగం సినిమాలో నటించారు. భార్యాభర్తలిద్దరూ నిరక్షరాస్యులే అయినా సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు కథలు, పాటలు రాయడం వారి ప్రత్యేకత. ప్రస్తుతం కడు పేదరికంలో కాలం వెళ్లదీస్తున్నారు మొగిలయ్య దంపతులు.ఐతే తాజాగా బలగం ఫేమ్‌ గాయకుడు పీ మొగిలయ్య (68)ను మంగళవారం రాత్రి హైదరాబాద్‌ నిమ్స్‌ దవాఖానకు తరలించారు.

వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన మొగిలయ్య గత కొంతకాలంగా మూత్రపిండాలు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.వరంగల్‌లోని సంరక్ష దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయనకు మెరుగైన చికిత్స అందించేందుకు నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం నిమ్స్‌ పాత భవనంలోని ఎమ్మార్సీయూ విభాగంలో నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్‌ గంగాధర్‌ పర్యవేక్షణలో వైద్యులు మొగిలయ్యకు చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply