Shami |ఆ అమ్మాయి కోసమే షమీ రాత్రి విధ్వంసం సృస్టించడా..

Shami

Shami | బుధవారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ తో తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి ముందు 397 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది. ఛేదనలో తొలుత తడబడ్డ న్యూజిలాండ్ జట్టు.. ఆ తర్వాత పుంజుకుని ఓ దశలో గెలుపు దిశగా సాగింది. ఆ సమయంలో ధాటిగా ఆడుతున్న విలియమ్సన్ కొద్దిలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. విలియమ్సన్ ఇచ్చిన క్యాచ్ ను షమీ జారవిడిచాడు. దీంతో స్టేడియంలో టెన్షన్ నెలకొంది.దానిపై షఫీ స్పందించాడు ఒక్కసారిగా టెరిబుల్ గా ఫీలయ్యానని, చాలా బాధపడ్డానని అన్నాడు.

అది తనకు కాళరాత్రిగా మిగిలిపోతుందేమోనని భయపడినట్లు వివరించాడు. బౌలింగ్ చేసేటపుడు ఆ భయమే తనను వెంటాడిందని, బ్యాట్స్ మెన్ ను ఔట్ చేయడమే టార్గెట్ గా బంతులు సంధించానని తెలిపాడు.అది పక్కన పెడితే ఫ్యాషన్ డిజైరన్ అయిన హసిన్ జహాన్‌ను క్రికెటర్ మహ్మద్ షమీ 2014లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు కూడా జన్మించింది. కానీ వీరి వివాహం బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు.

2018లో షమీపై అతని భార్యనే తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. షమీపై గృహ హింస, వరకట్న వేధింపులు, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఆరోపణలు చేసింది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. దూరంగా ఉన్నప్పటికీ కొంతకాలం విడాకులు తీసుకోలేదు. ఆ తర్వాత చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై బీసీసీఐ చేసిన విచారణలో షమీ నిర్దోషిగా తేలాడు. ఆ తర్వాత షమీ, హసిన్ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. కానీ ఈ వివాదం ఇంతటితో ముగియలేదు. తనకు నెలకు రూ.10 లక్షలు భరణం కావాలంటూ షమీ భార్య హసిన్ కోర్టును ఆశ్రయించింది.

అందులో తన వ్యక్తిగత ఖర్చులకు రూ.7 లక్షలు, కుమార్తె పోషణకు రూ.3 లక్షలుగా పేర్కొంది. అయితే ఇరువైపుల వాదనలు విన్న కోర్టు కీలక తీర్పు వెలువరించింది. హసీన్ జహాన్‌కు షమీ నెలకు రూ.1.30 లక్షలు భరణంగా ఇవ్వాలని తీర్పు వెలువరించింది. ఇందులో రూ.80 వేలు హసీన్ ఖర్చులకు, రూ.50 వేలు కూతురి పోషణకు వినియోగించాలని పేర్కొంది.అయితే తాజాగా మాత్రం అతని జీవితంలోకి ఓ కొత్త అమ్మాయి వచ్చిందని వార్తలు గుప్పుమంటున్నాయి. హీరోయిన్ పాయల్ ఘోష్ నే షమీ లైఫ్ లోకి వచ్చిందని అంటున్నారు.ఆమె వల్లే మళ్ళీ శ్రమించి జట్టులో మళ్లీ స్థానం దక్కింది అని కొందరు అంటున్నారు.

Leave a Reply